ఓ డైరెక్టర్ ను స్టార్ స్టేటస్ నుండి పాతాళానికి పడేసిన సినిమా, ఓ స్టార్ హీరోని ఆయన అభిమానులే ట్రోల్ చేసేలా చేసిన సినిమా, అటు హీరో పై ఇటు డైరెక్టర్ పై ఆ మూవీ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు.. ఆ మూవీనే మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన " ఆగడు ". మరి ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. !

మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో 2011వ సంవత్సరంలో " దూకుడు " అనే మూవీ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఓ ప్రభంజనం. కలెక్షన్ల పరంగాను, రికార్డుల పరంగాను, దూకుడు మూవీ చేసిన రచ్చ మహేష్ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఇక మహేష్ లోని మునుపెన్నడూ చూడని ఫుల్ లెన్త్ కామిడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి మహేష్ అభిమానుల్లో చెరిగిపోని ముద్ర వేశాడు దర్శకుడు శ్రీను వైట్ల. దూకుడు తరువాత మహేష్ క్రేజ్ శిఖరాగ్రానికి చేరిగా.. ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా టాప్ 4 లో స్థానం సంపాదించుకున్నాడు.

దూకుడు సినిమాతో మహేష్-శ్రీను వైట్ల కాంబినేషన్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చే రెండో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు మహేష్ బాబు " 1 నేనొక్కడినే " సినిమా తరువాత ఈ కాంబినేషన్ మరొకసారి రిపీట్ అయ్యింది. మహేష్ " 1 నేనొక్కడినే " మూవీ భారీ ఫ్లాప్ గా నిలవడంతో శ్రీను వైట్ల-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు " ఆగడు " అనే టైటిల్ ప్రకటించడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

 ఇక ఈ సినిమా విడుదలకు ముందు మహేష్ అభిమానులు కనీ వినీ ఎరుగని రీతిలో హంగామా చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 19,2014 లో రిలీజ్ అయ్యింది. సినిమా విడుదల అయ్యాక ఫస్ట్ షో నుండే భారీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దూకుడు, గబ్బర్ సింగ్ మూవీల మిక్సింగ్ లా ఉందంటూ సినిమాపై భారీ విమర్శలు వచ్చాయి. ఇక ఈ సినిమా తరువాత డైరెక్టర్ శ్రీను వైట్లపై భారీ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. మహేష్ అభిమానులు వైట్లకు కాల్ చేసి లైవ్ ఇంటర్వ్యూ లో తిట్టడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. 

ఇక సినిమాలోని మహేష్ క్యారెక్టర్ పై ఆయన అభిమానులే విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో సినిమా రిజల్ట్ పై మహేష్ బాబు స్వయంగా అభిమానులకు సారి చెప్పడం గమనార్హం. ఇక కలెక్షన్ల పరంగాను " ఆగడు " మూవీ భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. అయితే ముఖ్యంగా ఈ సినిమా రిజల్ట్ డైరెక్టర్ శ్రీను వైట్ల పై అధికంగా ప్రభావం చూపింది. " ఆగడు " మూవీకి ముందు స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన శ్రీను వైట్ల " ఆగడు " తరువాత ఒక్కసారిగా ఆయన క్రేజ్ పాతాళానికి పడిపోయింది. ఆ తరువాత రామ్ చరణ్ తో " బ్రూస్లీ ", రవితేజ తో " అమర్ అక్బర్ ఆంథోనీ " వంటి సినిమాలు చేసినప్పటికీ " ఆగడు " మూవీ ఎఫెక్ట్ తో ఈ సినిమాలు కూడా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో శ్రీనువైట్ల స్టార్ డైరెక్టర్స్ జాబితా నుండి పూర్తిగా ఫెడ్ అవుట్ అయిపోయాడు. ఏది ఏమైనప్పటికి మహేష్ బాబు మూవీ తోనే స్టార్ స్టేటస్ అందుకున్న శ్రీను వైట్ల మళ్ళీ మహేష్ మూవీ తోనే ఫెడ్ అవుట్ అయిపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: