సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ‘ఐ’. ఈ సినిమాలో విక్రమ్ విభిన్న క్యారెక్టర్ లో నటించారు. విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీలో అమీ జాకాసన్ హీరోయిన్ గా నటించింది. శంకర్ మొదటిసారి ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కి సైన్స్ అండ్ టెక్నాలజీని జోడించి తీసిన ఈ విజువల్ ట్రీట్ సినిమాలో విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. గతంలో విక్రమ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అపరిచితుడు’ తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. ఇక వీరిద్దరి కంబినేషన్ వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే 'ఐ' సినిమా పోస్టర్లు, ట్రైలర్, విక్రమ్ వేషధారణ చూసి ఇది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనుకున్నారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది. భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్ నేతృత్వంలో 2015 జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన 'ఐ' ప్లాప్ గా నిలిచింది. గతంలో అపరిచితుడు సినిమా సాధించిన విజయం, డైరెక్టర్ శంకర్ కు ఉన్న క్రేజ్ తో ఐ సినిమా ఓపెనింగ్ లో భారీ వసూళ్ళ ను రాబట్టినా తర్వాత బాక్స్ ఆఫీసు వద్ద డీలా పడింది.


సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెప్పే మాట ‘ఐ’ సినిమా విజువల్స్, లోకేషన్స్, మేకప్ టెక్నాలజీ అత్యద్బుతంగా ఉన్నాయి. ఎప్పుడూ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే హాలీవుడ్ సినిమాలే అని చెప్పుకునే వారికి మన ఇండియన్ సినిమాలు హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోవు అనే రేంజ్ లో విజువల్స్ చూపించారు శంకర్. కానీ ఈ సినిమా క్రియేట్ చేసిన అంచనాలను అందుకోలేకపోవడం ఈ సినిమా మొదటి మైనస్ పాయింట్. ఇక సినిమా పరంగా వస్తే… ‘ఐ’ సినిమా విజువల్స్ పరంగా ఎంత గ్రాండ్ గా ఉన్నా చెప్పే కథలో దమ్ములేకపోతే అస్సలు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. అందుకు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: