యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

నాగ : ఈ సినిమా 2003లో విడుదలైంది. డీకే సురేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో డిజాస్టార్ గా నిలిచింది. సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా సద, జెన్నీఫర్ హీరోయిన్లుగా నటించారు.

ఆంధ్రావాలా : శివమణి లాంటి సూపర్ హిట్ తరవాత పూరి జగన్నాథ్ ఓన్ గా కథ రాసిన సినిమా ఆంధ్రావాలా. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. సినిమాలో ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ మరియు హీరోయిన్ సినిమాకు మైనస్ గా నిలిచాయి.

నా అల్లుడు : ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయ్యిన సినిమాల్లో నా అల్లుడు కూడా ఒకటి. ఈ సినిమాకు వర ముళ్ల పూడి దర్శకత్వం వహించారు. ఇక నాన్ సెన్స్ కామెడీతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

నరసింహుడు : ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయింది. నరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కింది. అయితే ఆ అంచనాలను మాత్రం రీచ్ అవ్వలేకపోయింది.

శక్తి : 2011 లో ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కింది. అష్టాదశ దశ పీఠాలు, ఈజిప్టు మాంత్రికుడు లాంటి స్టోరీలైన్ తో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన నిర్మాత అశ్వినీ దత్సినిమా దెబ్బకు కొన్నేళ్ల  ఇండస్ట్రీలో కనిపించకుండాపోయారు. ఈ చిత్రానికి అప్పట్లో 48 కోట్లు ఖర్చు చేయగా కేవలం 19 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాతో మెహర్ రమేష్ సినిమా అంటే భయపడే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: