కరోనా కష్టాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ లో కరోనా వచ్చిన రోగులకు సరైన సదుపాయాలు సకాలంలో అందక వేలాదిమంది అశువులు బాస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితి టాలీవుడ్ యువ దర్శకుడు సుబ్బు కి ఎదురయింది. వివరాల్లోకి వెళితే, గత సంవత్సరం సాయి ధరమ్ తేజ్ కు సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు సుబ్బు. కరోనా మొదటి వేవ్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేసి మొదటి విజయాన్ని సినిమా పరిశ్రమకు అందించాడు. ప్రస్తుతం ఈయనకు జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న అభిమానులు మరియు సినీ వర్గాలు ఘొల్లుమంటున్నాయి. దర్శకుడు సుబ్బు తల్లి అయిన శ్రీ మంగమ్మ గారు కొద్ది రోజులుగా కరోనా వచ్చి బాధపడుతూ ఉన్నారు.

చివరికి ఆమె పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కు వెళ్లారు. కానీ హాస్పిటల్ లో ఐసీయూ గదులు ఖాళీగా లేకపోవడంతో పరిస్థితి చేయిదాటి పోయి నిన్న రాత్రి తుది శ్వాశ విడిచారు. ఐసీయూ లేక ప్రాణాలనే కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని బంధువులు మరియు సన్నిహితులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నా కూడా ఇలాంటి వాటికి పరిష్కారం దొరకడం లేదు అంటూ రోగులు హాస్పిటల్స్ వద్ద రోదిస్తున్నారు. ఎంత డబ్బున్న వారైనా కూడా హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్, ఆక్సిజన్ మరియు బెడ్స్ దొరక్క సునాయాసంగా తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని ఈ ఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్న కొందరు అంటున్నారు.

ఈ మధ్య ఎక్కువగా సినీ ప్రముఖులకు ఇలా జరుగుంతుండడం పరిశ్రమను తీవ్రంగా బాధిస్తోంది. కొన్ని రోజుల క్రిందట ప్రముఖ నటి తన తమ్ముడి ప్రాణాల కోసం హాస్పిటల్ ముందే అందరినీ బ్రతిమాలుకున్నా...అతని ప్రాణాలు కాపాడలేకపోయింది. అంతే కాకుండా తెలుగు కమెడియన్ మరియు హీరో అయిన సప్తగిరి తన స్నేహితుడు మరియు దర్శకుడిని లక్ష రూపాయలు సహాయం చేసి కూడా అతన్ని రక్షించుకోలేకపోయాడు. ఇవన్నీ తలచుకుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నామో అనిపిస్తుంది. మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి ఈ కరోనా కోసం హాస్పిటల్స్ కి కావలసిన అన్ని సౌకర్యాలను ముఖ్యంగా ఐసీయూ లేని చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అలంటి హాస్పిటల్స్ ని ఎంచుకుని వాటిలో ఈ ఐసీయూ లాంటి సౌకర్యలను ఏర్పాటు చేసి మరింతమంది ప్రాణాలు కోల్పోకుండా చూడాలి అని అభిప్రాయపడుతున్నారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: