గోదావరి యాసతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్. ఫార్ట్ ఫిలింస్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత సినిమా చూపిస్తా మామ, కుమారి 21ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాలలోనూ తనదైన నటన కనబరిచాడు. కానీ ఈ సినిమాలు అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేక పోయాయి. దాదాపు రాజ్ తరుణ్ కెరీర్ ఆగిపోవస్తుంది అనుకున్నప్పుడు ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఈ సినిమాకు విజయ్ కుమార్‌ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత రాజ్ తరుణ్ ఒరేయో బుజ్జిగా దర్శకుడితో మరో సినిమాను రూపొందించాడు. వీరి కాంబోలో వచ్చిన రెండో సినిమా పవర్ ప్లే.


సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. అయితే తాజాగా రాజ్ తరుణ్ తమిళంలోకి అరంగట్రం చేసేందుకు సిద్దమవుతున్నాడట. తెలుగులో రాజ్ తరుణ్ చేసిన తాజా సినిమా పవర్ ప్లేను తమిళంలో అనువాదం చేయనున్నారు. ఈ అనువాద సినిమాలోనూ రాజ్ తరుణ్‌ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించనున్నాడని టాక్ నడుస్తోంది. ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవికా అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్‌లుగా నటించారు.  ఈసినిమా ఓటీటీలో విడుదలయింది. ఈ చిత్రానికి ప్రజాదరణ బాగానే లభించింది. అందుకనే ఈ సినిమాను తమిళంలోకి అనువదించాలని చూస్తున్నారు.



అయితే ఈ సినిమాలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన హీరోకు... నకిలీ నోట్లు వస్తాయి. వాటిని చూసిన హీరో ఆశ్చర్యపోతాడు. ఏటీఎంల్లో డబ్బులు నింపే ఏజెన్సీలు ఈ నకిలీ నోట్లను ముద్రించి, అందులో నింపు తున్నట్టు గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథ. ఇందులో విలన్‌ పాత్రను పూర్ణ పోషించింది. ఆమెతోపాటు హేమా లింగనే, ప్రిన్స్‌, అజయ్‌, సత్యం రాజేష్‌, పూజా రామచంద్రన్‌, రాజా రవీంద్రా, కేదార్‌ శంకర్‌, రవివర్మ, ధన్‌రాజ్‌ తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: