గత ఏడాది ఈ మహమ్మారి కరోనా దెబ్బకు మన దేశంతో పాటు ప్రపపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి కాకుండా ఎక్కడికక్కడ దేశాలు లాక్ డౌన్ విధించాయి. దానితో అనేకరంగాలు మూతబడి నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు కోట్లాదిమంది ప్రజలు చేయడానికి పనుల్లేక తినడానికి సరైన తిండి లేక ఎన్నో అవస్థలు పడ్డారు.

ఆ తరువాత కొన్ని నెలల అనంతరం మెల్లగా లాక్ డౌన్ ని దేశాలన్నీ విడతలవారీగా సడలించాయి. అయితే పరిస్థితి మెల్లగా కొలిక్కి వచ్చింది అనుకున్న తరుణంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో మన దేశంలో లక్షలాది ప్రజలు మళ్ళి ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దానితో అనేక  రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణ సహా తమిళ నాడులో కూడా రోజుకు వేలాది కేసులు నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు విధించింది.

అక్కడి ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు కరోనాకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్ల సప్లై వంటి వాటిపై గట్టిగా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పలువురు ప్రముఖులు, సినిమా నటులు ఈ విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి తమవంతుగా వీలైనంతలో విరాళాలు అందిస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినిమా నటులు భారీ విరాళాలు ఇవ్వగా నేడు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్ తనవంతుగా కరోనా రిలీజ్ ఫండ్ కు రూ. 50 లక్షలు సాయం అందించారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి ఇళ్ళలొనే ఉండాలని కోరారు రజిని. రాబోయే కొద్దిరోజుల్లో ఈ మహమ్మారి నుండి మన దేశం తప్పకుండా బయటపడుతుందని రజిని ఆశాభావం వ్యక్తం చేసారు ... !!

మరింత సమాచారం తెలుసుకోండి: