సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ అగ్రహీరో సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక తమ అభిమాన హీరో క్రేజీ దర్శకుడితో జతకట్టాడంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. వారి కాంబో మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఉవ్విళ్లూరుతుంటారు. అంతటి అంచనాలు పెంచి తీరా థియేటర్లో బొమ్మ అభిమానులను మెప్పించలేక దారుణంగా ప్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా ప్లాప్ అయిన సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా కూడా ఒకటి. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండో సినిమా ఖలేజా. ఈ సినిమా అభిమానుల్లో తారాస్థాయి అంచనాలను రేకెత్తించింది. కానీ తీరా విడుదల అయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.


ఖలేజా సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగనమల రమేష్, సీ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించగా విలక్షణ నటుడు ప్రజాష్ రాజ్ విలన్ పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా దైవం మనుష్య రూపేణా అనే భావన నేపథ్యంలో తెరెకెక్కింది. ఓ భారీ బిజినెస్ మ్యాన్ చేసే దుష్టచర్యలను ఓ టాక్సీ డ్రైవర్ ఎలా ఎదుర్కున్నాడు అనేది సినిమా కథ. ఇందులో విలన్ చేత బాధింపబడుతున్న ఓ గ్రామ ప్రజలు హీరోను దేవుడిగా కొలుస్తారు. అంతేకాకుండా హీరోను కూడా నమ్మిస్తారు. అయితే ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ అభిమానులు ఊహించిన విధంగా సినిమా ఆకట్టుకోలేక పోయింది. ఖలేజా చిత్ర యూనిట్‌కి ఊహించని ప్లాప్‌గా ఈ సినిమా నిలిచిపోయింది.



ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు అనే ఓ టాక్సీ డ్రైవర్ పాత్రలో మహేష్ నటించాడు. ఈ సినిమాలో కథ, కథనంతో పాటు అన్ని విషయాలు వైవిధ్యంగా ఉన్నా సినిమా రాణించలేక పోయింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన బాణీలకు అనుగుణంగా రామజోగయ్య శాస్త్రి పాటలను రచించారు. కానీ అభిమానులు ఊహించినటువంటి అంశాలు సినిమాలో అంతగా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కానీ ఈ సినిమా టీవీల్లో వచ్చిన ప్రతి సారి ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన సినిమాల్లో ఖలేజా టాప్‌లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: