ప్రస్తుతం టాలీవుడ్ కి రెండు స్ట్రాంగ్ పిల్లర్స్ అంటే ఎవరైనా చెప్పేది ఆ ఇద్దరి హీరోల పేర్లే. వారు ఎవరంటే ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరికీ ఎప్పట్నుంచో టాలీవుడ్ లో పెద్ద పోటీ నడుస్తుంది. ఇద్దరికీ సూపర్ క్రేజ్ అలాగే టాలీవుడ్ లో ఏ హీరోకి లేనటువంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తెలుగు పరిశ్రమలో రికార్డులు చాలా ఈజీగా సృష్టిస్తూ మకుటం లేని మహా రాజులుగా దూసుకుపోతున్నారు. వీరిద్దరి సినిమాలు యావరేజ్ గా ఆడితేనే నిర్మాతలు, బయ్యర్లు భారీ లాభాలు దక్కించుకుంటారు.అలాంటిది వీరి సినిమా హిట్ అయితే కనుక టాలీవుడ్ పాత రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం. ఇలా చాలా సందర్భాల్లో రుజువైంది. మహేష్ రికార్డులని పవన్ బద్దలు కొట్టడం పవన్ రికార్డులని మహేష్ బద్దలు కొట్టడం చాలా కామన్.


అయితే ఇంతటి గొప్ప స్టార్ డం వున్న ఈ స్టార్ల కెరీర్ లో వాళ్లే కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎన్నటికి మరచిపోలేని భారీ డిజాస్టర్ మూవీస్ వున్నాయి. ఇప్పటికి ఫ్యాన్స్ ఆ సినిమాలు చెయ్యకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. ఇంతకి వాళ్ళ కెరీర్ లో నిలిచిన ఆ చెత్త సినిమాలు ఏమిటంటే.. ఒకటి 'బ్రహ్మోత్సవం' రెండోది 'అజ్ఞాతవాసి'.ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చి చాలా ఘోరంగా అభిమానులని నిరాశపరిచాయి.


ఇక ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా విషయానికి వస్తే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇండస్ట్రీ హిట్ కంబ్యాక్ మూవీ 'శ్రీమంతుడు' సినిమా తరువాత రిలీజ్ అయ్యింది. శ్రీమంతుడు ఇచ్చిన కిక్ లో వున్న అభిమానులు బ్రహ్మోత్సవం మొదటి షోకే చాలా నిరాశచెందారు. అసలు మహేష్ ఇలాంటి సినిమా చెయ్యటం ఏంటి నిజంగా స్టోరీ వినే ఈ సినిమా చేశాడా అని అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి.


ఇక పవర్ స్టార్ అజ్ఞాతవాసి సినిమా విషయానికి వస్తే ఇది ఫ్యాన్స్ కి పెద్ద పీడకలే అని చెప్పాలి. పవన్ కి ఎన్ని ప్లాపులు వచ్చిన ఫ్యాన్స్ ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు కాని ఈ సినిమా ఫ్లాపవ్వగానే వాళ్ళ పరువు పోయిందనే చెప్పాలి. త్రివిక్రమ్ లాంటి సూపర్ డైరెక్టర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతోందనుకుంటే మొదటి షో కే కుప్ప కూలిపోయింది. రికార్డుల సంగతి పక్కనపెడితే మినిమమ్ పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వసూలు చెయ్యలేక చతికల పడింది.ఈ సినిమా కి వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు. బ్రహ్మోత్సవం అయిన ఫ్యామిలి ఆడియన్స్ ని కొంతమేర ఆకట్టుకుంది. కాని అజ్ఞాతవాసి మాత్రం ఏ వర్గం వారిని ఆకట్టుకోలేక టైటిల్ కి తగ్గట్లే అజ్ఞాతం లోకి వెళ్లి ఫ్యాన్స్ పరువు అడ్డంగా తీసింది. ఇక ఈ రెండు సినిమాలు ఈ టాలీవుడ్ పిల్లర్స్ కెరీర్ లోనే మరిచిపోలేని దారుణమైన సినిమాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: