అక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ అంచనాలనతో విడుదలైన అఖిల్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు అప్పట్లో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. స్మార్ట్ హీరోగా ముందుగానే జనాలకు బాగా కనెక్ట్ అయిన అఖిల్ మొదటి సినిమా విడుదలకు ముందే ఒక రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు. అక్కినేని అఖిల్ మొదటి సినిమా సక్సెస్ అయ్యి ఉంటే అతని కెరీర్ మరోలా ఉండేదని చాలా మంది చెబుతుంటారు. మాస్ అడియెన్స్ లో అతనికి మొదట్లో మామూలు ఫాలోయింగ్ రాలేదు.

 ఇక దర్శకుడు వివి.వినాయక్ అనేసరికి అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయాయి.ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా నాగార్జున అఖిల్ కోసం అనేక రకాల కథలు విన్నాడు. ఇక ఫైనల్ గా వినాయక్ నితిన్ మాట్లాడుకొని అఖిల్ కోసం కథను రెడీ చేయించారు.అఖిల్ సినిమా విడుదలకి ముందు సినిమా పాటలకి , ట్రైలర్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా విడుదల తర్వాత మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ చూసి స్టార్ హీరోస్ సైతం ఆశ్చర్యపోయారు. దాదాపుగా 10కోట్ల కలెక్షన్స్ మొదటిరోజు అఖిల్ సినిమాకి వచ్చాయి. అయితే ఈ సినిమాకి వచ్చిన డిజాస్టర్ టాక్ తో రెండో రోజే సినిమా డీలా పడిపోయింది.

 అఖిల్ మీద మరియు సినిమా మీద నమ్మకంతో 48 కోట్ల బడ్జెట్ పెట్టిన నితిన్ కి ఈ సినిమా పెద్ద దెబ్బ వేసింది. చివరికి అఖిల్ సినిమా నిర్మాతలకి 30 కోట్ల నష్టాలని తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా ప్రభావం వలన నిర్మాతలు అఖిల్ తో ఆ రేంజ్ బడ్జెట్ సినిమాలు చేయడమే మానేశారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే కాదు , డైరెక్టర్ వివి వినాయక్ , నిర్మాత నితిన్ కెరీర్ లో కూడా పెద్ద మచ్చ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: