ప్రస్తుతం ఏ మెగా హీరో లేని సక్సెస్లతో ఉన్నాడు వరుణ్ తేజ్.. మొదట్లో కొన్ని సినిమాల ద్వారా తడబడ్డా కూడా వరుణ్ తేజ్ స్టోరీ సెలక్షన్ లో తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు.. వైవిధ్యం తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుని యంగ్ హీరోలకు ఎలాంటి స్టోరీ లు ఎంచుకోవాలో చూపిస్తున్నాడు..  ఫిదా, అంతరిక్షం, తొలిప్రేమ, f2 , గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో వరుస సినిమా లు సూపర్ హిట్ గా నిలవడంతో వరుణ్ తేజ్ గతంలో ఎప్పుడు లేని విధంగా మంచి ఫామ్ లో ఉన్నాడు..

 ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో అయన గని అనే సినిమా చేస్తున్నాడు. వరుస గా సినిమా లు సూపర్ హిట్ కావడంతో గని సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. నూతన దర్శకుడు కిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఈ సినిమాని అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ నిర్మిస్తుండడం విశేషం.. ఎన్నో అంచనాలమధ్య రాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకోగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తుండడం విశేషం..

ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా ఆ లుక్ కి  మంచి రెస్పాన్స్ దక్కింది.. ఇక కెరీర్ తొలినాల్లో కొన్ని తప్పులు చేసిన వరుణ్ తేజ్ ఇప్పటికీ ఓ సినిమా ఎందుకు చేశానని బాధపడుతున్నాడట.. అదే మిస్టర్.. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ పెద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది. లావణ్య త్రిపాఠి, హబ్బా పటేల్ హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా కి మిక్కీ జీమేయర్ సంగీతం అందించగా అందరికి ఈ సినిమా ఘోరపరాజయాన్ని నమోదు చేసినట్లయింది.  నిజంగా వరుణ్ తేజ్ కెరీర్ లో ఇలాంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా చేయలేదనే చెప్పాలి.. ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ సినిమాగా ఉండగా ఈ సినిమా మాత్రం తొలి రోజే ఫేడ్ అవుట్ అయిపొయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: