సాయి ధరమ్ తేజ్.. వరుసగా తొమ్మిది ప్లాప్ సినిమాలు వచ్చినా కూడా నిలబడి హిట్ కొట్టి మళ్ళీ తన యదా స్థానానికి వచ్చాడు.. వేరే ఏ హీరో అయినా ఇన్ని ప్లాప్ లు వస్తే వెళ్లిపోయేవాడే..కానీ సాయి తేజ్ మాత్రం ఓటమి ని ఎదుర్కొని హిట్ కొట్టాడు..తొలి సినిమా రిలీజ్ కాకపోయినా రెండు సినిమా తో హీరో గా ఇంస్ట్రీ లోకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.  మొదట్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు..

వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. చెప్పిన మాట ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో థియేటర్లలో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు..మొదటి కరోనా నేపథ్యంలో అన్ని ధియేటర్ మూసివేయగా ఈ సినిమా తోనే థియేటర్ లు ఓపెన్ అయ్యాయి.. ఇదిలా ఉంటే ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా సాయి తేజ్ ఆ సినిమా చేశాడు.. ఎందుకు చేశాడో ఏమో కారణం అయితే తెలీదు కానీ సినిమా మొత్తం గాలికి వదిలేసినట్లే కనిపిస్తుంది..

అదే తిక్క.. సినిమా మొత్తం తిక్క అనే కాన్సెప్ట్ మీదే ఉంటుంది.. సునీల్ రెడ్డి దర్శకత్వంలో లారిస్సా బొనెసి హీరోయిన్ గా 2016 లో రిలీజ్ కాగా ఈ సినిమా మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు రాగా ఆ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.. ఈ సినిమా ఫ్లాప్ అని తెలియడానికి ఈ ట్రైలర్ చూస్తే చాలు అనిపిస్తుంది. ఈ సినిమా లో మన్నారా చోప్రా కూడా నటించగా ఆమె అందచందాలు కూడా ఈ సినిమా కి ఏవిధంగా ఉపయోగపడలేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా మంచి మార్కులే కొట్టేసిన సినిమా పరంగా మాత్రం సాయి తేజ్ కెరీర్ ని అతలాకుతలం చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: