యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు. అయితే మధ్యలో ఆయన నటించిన సినిమాల్లో కొన్ని పరాజయం పాలయినవి కూడా ఉన్నాయి. తన కెరీర్ లో ఏడవ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మూవీ సింహాద్రి. అప్పట్లో అతి పెద్ద సంచలన విజయూయాన్ని అందుకున్న ఈ మూవీతో హీరోగా ఎన్టీఆర్ కు భారీ ఇమేజ్, పాపులారిటీ దక్కాయి. అయితే ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ తో కలిసి ఆంధ్రావాలా సినిమా చేసారు. రక్షిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించగా భారతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై గిరి ఈ మూవీని నిర్మించారు.

యంగ్ టైగర్ డయల్ రోల్ పోషించిన ఈ సినిమాలో సంఘవి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘు కుంచె, రమాప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. బ్రతుకుతెరువు కోసం ముంబై వెళ్లిన శంకర్, ఆ తరువాత అక్కడి పరిస్థితులు, కొందరు దుండగుల దుశ్చర్యల కారణంగా వారిపై తిరగపడి శంకర్ పహిల్వాన్ గా మారుతాడు. అలానే అక్కడి తెలుగు వారికి అండగా నిలిచి ఆంద్రావాలా గా మంచి పేరు దక్కించుకున్న శంకర్ ఆ సమయంలో తన భార్యతో సహా అనేకమందిని కోల్పోతాడు.

ఆ తరువాత అతడి మరణం, ఆపై కొన్నేళ్ల తరువాత అతడి తనయుడు మున్నా ముంబై స్లమ్ లో పెరుగుతాడు. అయితే తనపై శత్రువుల దాడితో తండ్రి గురించిన గతం తెలియడం, ఆపై మున్నా విలన్స్ పై పగతీర్చుకోవడం జరుగుతుంది. వాస్తవానికి కథ పరంగా పర్వాలేదనించిన ఈ సినిమాని ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించడంలో దర్శకుడు పూరి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మొదటి రోజు నుండే డిజాస్టర్ టాక్ సంపాదించుకున్నప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అలా ఎన్టీఆర్ కెరీర్ లో ఆంధ్రావాలా భారీ ఫ్లాప్ గా మిగిలింది ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: