యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో " ఆర్.ఆర్.ఆర్ " మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రెల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు కొరటాల ప్రకటించారు.

ఇక కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన " జనతా గ్యారేజ్ " మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక " ఆర్.ఆర్.ఆర్ " టీం కూడా తారక్ పుట్టిన రోజుకు ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ గత పుట్టిన రోజుకి ఎలాంటి అప్డేట్ ఇవ్వని జక్కన్న ఈసార్ మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం.

మరి అటు జక్కన్న, ఇటు కొరటాల ఇద్దరు కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంచితే ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవల స్పష్టం చేశాడు. మరి ఈ కాంబినేషన్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో " సలార్ " మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలేక్కే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: