దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం చాలా తీవ్రంగా వుంది. రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇక తమిళనాడులో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ ఘోరమైన వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి, ఇంకా అరికట్టడానికి ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి, ఎం.కె.స్టాలిన్ కరోనా నుంచి ఉపశమనం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ని ప్రకటించారు.తమిళనాడు సిఎం ప్రజా సహాయ నిధికి సహకరించడం ద్వారా ప్రభుత్వానికి సహాయం చేయాలని తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ప్రకటన ఆధారంగా ప్రజలతో పాటు ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు కూడా వారికి డబ్బును అందించారు.


ఇక తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ కూడా ఈ జాబితాలో చేరాడు.ఆన్‌లైన్ పే మెంట్ ద్వారా భారీగా రూ .30 లక్షలు డబ్బును సహాయనిధికి పంపించారు. కొన్ని వారాల క్రితం విక్రమ్ ఇంకా అతని కుమారుడు హీరో ధ్రువ్ కలిసి ఎంకె స్టాలిన్ ను కలుసుకున్నారు. ఇక అప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయినందుకు ఆయనను అభినందించారు.ఇక విక్రమ్ కంటే ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ సిఎం స్టాలిన్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని రూ .50 లక్షలు అందించారు.ఇక రజిని వార్తలు ఈ రోజు ఉదయం బయటకు వచ్చాయి ఇక ఇప్పుడు ఆ వార్తలతో పాటు విక్రమ్ వార్తలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌ను బద్దలుకొడుతున్నాయి.


ఇక విక్రమ్,రజనీకాంత్ లతో పాటు, హీరో అజిత్  25 లక్షలు, సూర్య, కార్తీక్, శివకుమార్ ముగ్గురు కలిసి 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. నటుడు శివకార్తికేయన్ రూ. 25 లక్షలు, జయం రవి రూ .10 లక్షలు ఇచ్చారు.సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఇటీవల ముఖ్యమంత్రిని కలుసుకుని తన భర్త ధనుష్ సంస్థ పేరిట రూ .1 కోటి విరాళంగా ఇచ్చారు. శంకర్, వెట్రిమారన్ వంటి దర్శకులు ఒక్కొక్కరు రూ .10 లక్షలు ఇవ్వగా సెన్సేషనల్ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ భారీ మొత్తంలో రూ .25 లక్షలు అందించారు. సిఎం రిలీఫ్ ఫండ్లకు ఉదయనిధి స్టాలిన్ కూడా సహకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: