సాధార‌ణంగా మ‌గ‌వాళ్ల‌ను అందం గురించి ఎక్కువ‌గా మ‌హేష్ బాబుతో పోలుస్తుంటారు. నువ్వు ఏమైనా మ‌హేష్ బాబు అనుకుంటున్నావా..అచ్చం మ‌హేష్ బాబు లా ఉన్నాడు..మ‌హేష్ బాబులా ఫీల్ అవుతున్నావుగా అనే డైలాగులు వినిపిస్తుంటాయి. అంటే మ‌హేష్ బాబును అందానికి నిర్వ‌చ‌నంలా భావిస్తుంటారు. అయితే అలాంటి మ‌హేష్ బాబు హెయిర్ పై ఓ వార్త క‌నిపిస్తూ ఉంటుంది. ఆయ‌న హెయిర్ రియ‌ల్ కాద‌ని అప్పుడ‌ప్పుడూ నెట్టింట వార్త‌లు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. అస‌లు ఇప్పుడు మ‌హేష్ బాబు హెయిర్ గురించి టాపిక్ ఎందుకు వ‌చ్చిందంటే..ఈ రోజు ఉద‌యం సాక్షి మీడియా ఓ ఆర్టిక‌ల్ ను ప‌బ్లిష్ చేసింది. మ‌హేష్ బాబు ది రియ‌ల్ హెయిరా విగ్గా అంటూ ఆర్టిక‌ల్ ను ప‌బ్లిష్ చేసింది. ఈ ఆర్టిక‌ల్ ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో మ‌హేష్ బాబు అభిమానులు ఆగ్ర‌హం వ‌క్తం చేశారు. మ‌హేష్ బాబు ది రియ‌ల్ హెయిర్ అంటూ వాదించారు. అంతే కాకుండా సాక్షి మీడియా పై ఫైర్ అయ్యారు. రిపోర్టులు కొట్టండంటూ ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

అంతే కాకుండా ఇత‌ర హీరోల అభిమానులు కూడా మ‌హేష్ బాబు అభిమానుల‌కే స‌పోర్ట్ ఇచ్చారు. రియ‌ల్ హెయిర్ అయితే మీకెందుకు విగ్ అయితే మీకెందుకు. క‌రోతో ప్ర‌జ‌లు మ‌రణిస్తుంటే ఇప్పుడు ఈ డిస్క‌ర్ష‌న్ అవ‌స‌ర‌మా అంటూ ప్ర‌శ్నించారు. దాంతో సాక్షి ఆర్టిక‌ల్ ను వెంట‌నే డిలీట్ చేసింది. అయితే ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం కాస్తా జ‌రిగిపోయింది. ఇదిలా ఉండ‌గా మ‌హేష్ బాబు తండ్రి సూప‌ర్ స్టార్ క్రిష్ణ కాంగ్రెస్ పార్టి మ‌ద్ద‌తుదారుడు. వెఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో క్రిష్ణ వైఎస్ఆర్ కే మ‌ద్ద‌తు ఇచ్చేవారు. దాంతో మ‌హేష్ బాబు అభిమానులు, సూప‌ర్ స్టార్ క్రిష్ణ అభిమానులు కూడా వైసీపీకే స‌పోర్ట్ చేస్తుంటారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోల‌లో మ‌హేష్ బాబు సంద‌ర్భాన్ని బ‌ట్టి వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మంచి ప‌థ‌కాల‌ను ప్ర‌శంసిస్తుంటారు. దాంతో ఇప్పుడు సాక్షి మీడియా మ‌హేష్ బాబుపై అలాంటి ఆర్టిక‌ల్ ప‌బ్లిష్ చేసిందేంటి అన్న ప్ర‌శ్న మొద‌లైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: