యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో " ఆర్.ఆర్.ఆర్ " మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపుగా చివరి దశకు వచ్చింది. ఇక ఈ సినిమాలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతరామరాజుగా, ఎన్టీఆర్ కొమరం బీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడిన సంగతి తెలిసిందే.

 ఇక ఈ మూవీ టైటిల్ ను ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటు ప్రశాంత్ నీల్ తో కూడా మూవీ ఉంటుందని ఇటీవల ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేశారు. ఇక వీటితో పాటు ఎన్టీఆర్ లిస్ట్ లో మరో డైరెక్టర్ పేరు కూడా తాజాగా వినిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 32వ సినిమా చెయ్యబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక గతంలో కూడా ఎన్టీఆర్-భన్సాలీ కాబినేషన్ పై వార్తలు వచ్చినప్పటికి కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అన్నీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఉండడంతో ఈ కాంబినేషన్ దాదాపుగా సెట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దేవదాస్, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి పీరియాడిక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్ కోసం కూడా ఓ పవర్ ఫుల్ పీరియాడిక్ స్టోరీ నే సిద్దం చేసుకున్నాడట భన్సాలీ, మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ కాంబినేషన్ పై వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: