విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ఎఫ్3. ఎఫ్2కు సీక్వెల్‌గా.. అంతకుమించిన ఫన్‌తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు షూటింగ్ నిలిచిపోయింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా బారిన పడడంతో చిత్ర యూనిట్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ వాయిదా పడి రిలీజ్ ఎప్పుడనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర బృందం ఓ డేట్ కూడా అనేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సినిమా షూటింగ్ సమయంలోనే కరోనా బారిన పడిన అనిల్ రావిపూడి పూర్తిగా కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్3 షూట్‌ను మళ్లీ స్టార్ట్ చేయబోతున్నారని టాక్. అది కూడా వచ్చే నెల అంటే జూన్ 16 నుంచి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో స్టార్ట్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సారథి స్టూడియోలో వేసిన ఒక ఓల్డ్ హౌస్‌లో వెంకీ-వరుణ్‌ల పై కొన్ని కామెడీ సీన్స్ తీస్తారట. ఈ షూట్ ముగిసిన తర్వాత తదుపరి షూట్ షెడ్యూల్ కూడా వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం.

కాగా..  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్టర్‌లో డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆకట్టుకుంటోంది.  ఇక ఈ సీక్వెల్‌లో కూడా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్‌లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ లైఫ్‌లో మనీకి ఇంపార్టెన్స్ పెరుగుతుందని, డబ్బుల కోసం నానా అవస్థలు పడతారని ఈ కాన్సెప్ట్ పోస్టర్‌తో మేకర్స్ చెప్పకనే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: