కరోనా దెబ్బకు దేశం మొత్తం వణికిపోతోంది. లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా.. ఈ వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగా ఉంది. దేశంలోని ప్రతి ఇండస్ట్రీ దీని బారిన పడింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు వాయిదా పడడం, అనేక సినిమాల షూటింగ్‌లు నిలిచిపోవడం వంటి కారణాలతో నిర్మాతలు, నటీనటులు, సినీ కార్మికులు తదితరులు భారీగా నష్టపోతున్నారు. అయితే మిగతా ఇండస్ట్రీల విషయం అంటుంచితే బాలీవుడ్‌కు సంబందించిన ఓ షాకింగ్ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే బాలీవుడ్ ఏకంగా వేల కోట్ల మేర నష్టపోయిందట.

దేశంలో సినీ ఇండస్ట్రీలు ఫుల్ స్వింగ్‌లో ఉండాల్సిన ఈ ఏడాది పూర్తిగా ఖాళీగా మారిపోయింది. కరోనా దెబ్బకు పరిశ్రమ మొత్తం వెలవెలబోతోంది. థియేటర్లు మూతపడ్డాయి. ఇక సినిమా షూటింగ్‌ల కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సినిమాల రిలీజ్‌లు నిలిచిపోయాయి. ఈ జాబితాలో అనేక చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా చిత్రాల మేకర్స్ కోట్లలో నష్టాల బారిన పడ్డారట. దీంతో ఇప్పటివరకు తేలిన ఓ అంచనా ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలోనే ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే రూ.4వేల కోట్ల మేర నష్టం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్చి వరకు బాక్స్ ఆఫీస్ ఆదాయం కేవలం రూ.50 కోట్లు మాత్రమేనట. ఇక అప్పటి నుంచి జూన్ వరకు ఏ మాత్రం ఆదాయం లేదని ట్రేడ్ మ్యాగజైన్ కంప్లీట్ సినిమా ఎడిటర్ అతుల్ మోహన్ అన్నారు. అదే గతేడాది.. అంటే 2020 మార్చితో  పోల్చితే అప్పటి ఆదాయం రూ.1150 కోట్లుగా ఉంది. కానీ ఈ సారి అది దారుణంగా పడిపోయింది.

కరోనా ఫస్ట్ వేవ్ దెబ్బకు గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొనడం, అక్టోబర్లో తిరిగి థియేటర్లు తెరుచుకున్నాక కూడా బాలీవుడ్‌లో సినిమాలను విడుదల చేయడానికి బడా మేకర్స్ వెనకడుగువేయడంతో పెద్దగా చిత్రాలు బాక్సాఫీసు ముందుకు రాలేదు. దీంతో బాలీవుడ్‌లో గతేడాది ఆఖరి నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు చెప్పుకోదగిన లాభాలు ఎవరూ దక్కించుకోలేకపోయారు. ఇక కొంతమంది ఓటీటీలవైపు వెళ్లిపోవడంతో ఆశించిన లాభాలు కూడా రాలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ రాధే చిత్రమే దీనికి ఉదాహరణ. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికీ అనేక సినిమాలు అలా మూలన పడి ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఇంకెంత నష్టం కలుగుతుందో ఏమో!

మరింత సమాచారం తెలుసుకోండి: