అక్కినేని నాగార్జున ఈ రోజా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన శివమణి సినిమా ద్వారా 9848022338 అనే ఫోన్ నెంబర్ ఎంతో ఫేమస్ అయ్యింది. నాగార్జున తన ఇంట్రడక్షన్ ఎవరికైనా చెప్పే సమయంలో తన ఫోన్ నెంబర్ కూడా చెబుతూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆసిన్, రక్షిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నాగార్జున కెరీర్లో ఓ మంచి చిత్రంగా మిగిలిపోయింది. ఇక మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం 9848032919 చెప్పే ఫోన్ నెంబర్ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. హీరో బృందం ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏడిపించే క్రమంలో వచ్చే ఓ సీన్లో ఈ నెంబర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెబుతాడు.
ఇటీవల విడుదలైన ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో హీరోయిన్ చెప్పే 9880362529 నెంబర్ కూడా ఎంతో ఫేమస్ అయ్యింది. ఓ సీన్ లో హీరోయిన్ తొందరపాటులో ఉండగా తన ఫోన్ కి రీఛార్జ్ చేయించాలని షాప్ కీపర్ దగ్గరికి వెళితే అతను నెమ్మదస్తుడు కావడం పలుమార్లు ఆమె ఈ ఫోన్ నెంబర్ ని చెప్పడం ఎంతో కామెడీగా ఉంటుంది. నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయింది అనే సినిమాలోని ఫోన్ నెంబర్ లు అయినా 9126123456, 9126126126 లు కూడా ఎంతో పాపులారిటీ దక్కించుకున్నాయి. ఈ రెండు నంబర్ల పైనే ఈ సినిమా మా కథ ఉంటుంది. ఇవే కాకుండా చాలా ఫోన్ నెంబర్లు సినిమాల ద్వారా పాపులర్ అయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి