రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. మిర్చి సినిమా దాకా కేవలం 40 కోట్ల లోపే మార్కెట్ వున్న ప్రభాస్ బాహుబలి సీరిస్ తో 2000 కోట్ల మార్కెట్ దాకా రీచ్ అయ్యాడు. అవును బాహుబలి రెండు సిరీస్ లు కలిపి దాదాపు 2000 కోట్ల పైనే వసూలు చేశాయి.దీంతో ప్రభాస్ మార్కెట్ ఒక్క సౌత్ ఇండియాలోనే కాదు దేశవ్యాప్తంగా ఏ హీరో అందుకోనటువంటి రేంజ్ కి వెళ్ళిపోయిందంటే అర్ధం చేసుకోవచ్చు ప్రభాస్ రేంజ్ ఏంటనేది.

ఇక సౌత్ ఇండస్ట్రీని చులకనగా చూసే నార్త్ ఇండస్ట్రీని షేక్ ఆడించాడు ప్రభాస్. ఇక ప్రభాస్ కోసం నార్త్ ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఎలా అయినా కాని ప్రభాస్ మార్కెట్ ని పడగొట్టి తమ నార్త్ ఇండస్ట్రీకి మునుపటి వైభవం తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. బాలీవుడ్ ఖాన్స్, కపూర్స్ ఇంకా బడా బడా నిర్మాతలు. కాని మార్కెట్ ఏమో కాని కనీసం ప్రభాస్ రికార్డుల దారిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. అయితే గ్రాస్ పరంగా చూసుకుంటే అమీర్ ఖాన్ దంగల్ ముందంజలో వున్నా కాని బాహుబలి 2 షేర్ కి మాత్రం ఆమడ దూరంలో వుంది.ఇక ప్రభాస్ రేంజ్ తెలుగు సినిమా రేంజ్ తెలుసుకున్న బాలీవుడ్ బడా బాబులు సైతం ప్రభాస్ కి 100 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

కాని మన తెలుగులో మాత్రం అంత ఇవ్వడానికి సాహసం చెయ్యట్లేదు. దిల్ రాజు, ప్రభాస్ కి ఇండస్ట్రీలో మంచి సాన్నిహిత్యం వున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా వీరి కాంబోలో సినిమాలు వచ్చాయి. కాని దిల్ రాజుకి ప్రభాస్ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ సినిమా చెయ్యడానికి దాదాపు 70 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట డార్లింగ్. దాంతో దిల్ రాజుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట. ఈ విషయం పై తీవ్ర ఆలోచనలో పడ్డాడట దిల్ రాజు. చూడాలి మరి ప్రభాస్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇస్తాడో ఇవ్వడో...

మరింత సమాచారం తెలుసుకోండి: