టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లెజెండరీ హీరో నందమూరి తారక రామారావు ముద్దుల మనవడిగా ఇండస్ట్రీకి పరిచయమై తన తాత గారి లాగే తెలుగు నాట విపరీతమైన అభిమానులను సంపాదించుకొని టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. కెరీర్ ఆరంభం నుంచే తన నటనతో హిట్టు ప్లాపు అనే సంబంధం లేకుండా ఆదరగోడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఎన్టీఆర్ ఒక ఆల్రౌండర్ హీరో అనే చెప్పాలి.డాన్స్, నటన, డైలాగ్స్ ఇలా ప్రతి విషయాలలో ఎన్టీఆర్ ని ఏమాత్రం తీసేయలేము. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా జీవించిపోతాడు. ఇండస్ట్రీలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ కి గొప్ప పేరుంది. అందుకే ఎన్టీఆర్ తో సినిమా అంటే ఏ డైరెక్టర్ అయినా మక్కువ చూపిస్తాడు. అయితే ఇన్నిటిలో దిట్ట అయిన ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో లుక్ విషయంలో విమర్శల పాలయ్యడు. రాఖి సినిమాలో అధిక బరువుతో ఎన్టీఆర్ చాలా విమర్శలు ఎదుర్కున్నాడు.


ఇక ఫ్యాన్స్ కూడా అప్పుడు చాలా నిరాశ చెందారు. ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ లావవ్వబోతున్నాడట.కొరటాల శివ తో చెయ్యబోయే తన రెండవ సినిమాలో ఎన్టీఆర్ మళ్ళీ మునుపటిలా లావవ్వాలని కొరటాల తారక్ ని డిమాండ్ చేస్తున్నాడట.కథ రీత్యా తారక్ లావు అవ్వాలని సూచిస్తున్నడట కొరటాల. అంతేగాక ఈ సినిమాలో తారక్ ఒక ఇంట్రెస్టింగ్ తాటుతో కూడా కనిపించబోతున్నాడట. ఇక గతంలో కూడా తారక్ ఊసరవెల్లి సినిమాలో తాటుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక కొరటాల సినిమాలో కూడా తారక్ ఇలా తాటుతో లావుగా మారి కనిపిస్తున్నాడట. మరి కొరటాల మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తారక్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. మరి ఈసారి కూడా ఈ ప్రభంజనం రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: