తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న  క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖ వాణి ఒకరు. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించి తన నటనతో మెప్పించింది  సురేఖవాణి. కామెడీ పాత్రల్లో సీరియస్ పాత్రల్లో ఇలా ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటించింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సురేఖవాణి అటు సినిమాల్లో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇక సురేఖవాణి అభిమానులందరూ తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం ఈ నటి ఎంతగానో ఫాలోయింగ్ సంపాదించింది.




 వివిధ బుల్లితెర కార్యక్రమాల్లో కూడా గెస్ట్  గా ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు  సురేఖవాణి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్ సురేఖ వాణికి సెకండ్ ఇన్నింగ్స్ కి ఎంతగానో ఉపయోగపడింది అన్నది అర్ధమవుతుంది. ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది అన్న విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం వివిధ సీరియల్స్ నిర్వాహకులు సురేఖవాణి ని సంప్రదిస్తున్నారట.



 ఇక సురేఖవాణి సీరియల్స్ లో నటించబోతోంది అని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.  మొన్నటివరకు సినిమాల్లో వివిధ రకాల పాత్రల్లో అలరించిన సురేఖవాణి.. మరికొన్ని రోజుల్లో ఇక సీరియల్ లో కీలక పాత్రలో నటించేందుకు సిద్ధమైంది అన్నది అర్ధమవుతుంది. ఇక ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ వార్తతో అభిమానులు మాత్రం ఎంతగానో ఆనందంలో మునిగిపోతున్నారు.  ఎన్నో రోజులనుంచి వెండితెరపై సురేఖవాణి అవకాశాలు దక్కించుకోవడం లేదు ఈ నేపథ్యంలో ఇక సురేఖవాణి సీరియల్ లో నటిస్తూ ఉండటంతో మరో సారి తన అభిమాన నటిని తెరపై చూడవచ్చు అని అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: