హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను దేవుడుగా ఆరాధించడమే కాదు మెగా కుటుంబాన్ని కూడ అదే స్థాయిలో అభిమానిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎప్పటి నుంచో హరీష్ శంకర్ కు చిరంజీవితో సినిమా చేయాలని ఒక కోరిక. చిరంజీవి కూడ హరీష్ శంకర్ తో మూవీ చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితులలో హరీష్ శంకర్ లేటెస్ట్ గా తీసిన ఒక కామెంట్స్ నాగార్జున అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఈవివి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో అందరితో ఛాటింగ్ చేసాడు. ఈ ఛాటింగ్ లో అల్లరి నరేష్ సుధీర్ వర్మ కళ్యాణ్ కృష్ణ బివిఎస్ రవి అనీల్ రావిపుడి లతో పాటు చాలామంది ఫ్యాన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

వీరి ఛాటింగ్ లో ‘హలో బ్రదర్’ మూవీ ప్రస్తావన వచ్చింది. 1994 ప్రాంతంలో విడుదలైన ‘హలో బ్రదర్’ నాగార్జున సూపర్ హిట్ సినిమాలలో ప్రధమ స్థానంలో కొనసాగుతోంది. ఈమూవీని నాగచైతన్యతో రీమేక్ చేయాలని నాగార్జున అనుకున్నప్పటికీ మళ్ళీ తన ఆలోచనలు మార్చుకున్నాడు. ఈనేపధ్యంలో ఈమూవీ గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ ఈమూవీని ఈవీవీ  సత్యనారాయణ నాగార్జునతో కాకుండా చిరంజీవితో చేసి ఉంటే మెగా స్టార్ కెరియర్ లో అభిమానులు మర్చిపోలేని మూవీగా మిగిలి ఉండేదని అభిప్రాయ పడ్డాడు.

ఇప్పుడు ఈ కామెంట్స్ నాగార్జున అభిమానుల దృష్టి వరకు రావడంతో వారంతా తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ‘హలో బ్రదర్’ లో నాగార్జున నటించిన కామెడీ ఆమూవీకి హైలెట్ గా మారిన విషయం వివరిస్తూ హరీష్ శంకర్ కు నాగార్జున నటన కనిపించ లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. యధాలాపంగా హరీష్ శంకర్ అన్న మాటలు నాగ్ అభిమానులకు బాధను కలిగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి హరీష్ శంకర్ ఒక మూవీని నాగార్జునతో తీయడానికి గతంలో ప్రయత్నించాడు అనేవార్తలు కూడ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: