ప్రస్తుతం ఎంతో మంది మగువలు కూడా మగాళ్లకు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.  ఇప్పటికీ ఎంతోమంది సినిమా పరిశ్రమలో హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నారు. అయితే ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం కేవలం చిత్ర పరిశ్రమలో కథానాయకలుగా మాత్రమే కాకుండా అటు బిజినెస్ లో కూడా తమకు తిరుగులేదు అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది హీరోయిన్లు ఓ వైపు సినిమాల్లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూనే మరోవైపు బిజినెస్ లో కూడా భారీగా సంపాదిస్తూ దూసుకుపోతున్నారు.



 అయితే కేవలం సినిమాల్లో హీరోయిన్లు మాత్రమే కాదు అటు హీరోల భార్యలు సైతం ఎంతో మంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ మహిళా సాధికారతను చాటుతున్నారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం తన తండ్రి వ్యాపారాల మొత్తం స్వయంగా చూసుకుంటోంది. ఒక మంచి బిజినెస్ వుమెన్ గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్రొఫెషన్ లో కొనసాగుతూ తమ సత్తా చాటుతున్నారు.  ఈ క్రమంలోనే దగ్గుబాటి వారసుడు రానా సతీమణి మహిక బజాజ్ కూడా త్వరలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.



 ఇటీవలే రానా తన ప్రియసఖి మహిక బజాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. రానా పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇకపోతే ఇటీవలే రానా సతీమణి మహిక బజాజ్ త్వరలో ఒక వ్యాపారం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. వన్ గ్రామ్ గోల్డ్ తరహాలోనే కొన్ని రకాల గోల్డ్ ఐటమ్స్ కు సంబంధించి  హ్యాండ్ మేడ్ వ్యాపారాన్ని అటు మహిక స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  రాజస్థాన్ లో ఉన్న తన ఫ్రెండ్ సహకారంతో మహిళా ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారట.  దీనికి అటు భర్త రానా నుంచి కూడా ఎంతగానో ప్రోత్సహం ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది మహిళలు వ్యాపారాల్లో రాణిస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు రానా సతీమణి కూడా వ్యాపారంలోకి అడుగు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: