సాధారణంగా స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదో ఒక సమయంలో సినీ పరిశ్రమ వైపు అడుగులు వేస్తుంటారు. వారికి బాగా తెలిసిన ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడే ఇన్వెష్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పటికే ఎంతో మంది  హీరోలు, హీరోయిన్ లుగా రాణించిన వారు నిర్మాతలు, దర్శకులుగా మారడం చూశాం, లేదా వారి కుటుంబ సభ్యులతో ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టించడం వంటి సందర్భాలు కూడా చూశాము.  ఇప్పుడు ఇదే తరహాలో అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్ట బోతున్నారనే వార్త అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈమె సినీ నిర్మాణం వైపు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా ఇందుకు ఆమెను సపోర్ట్ చేస్తున్నారట.  పెళ్లయినప్పటి నుండి ఓ గృహిణి గా ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన ఆమె ఇప్పుడు పిల్లలు కాస్త పెద్ద కావడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినికిడి.
 
అయితే తమ సొంత బ్యానర్ లోనే నిర్మాతగా మారాలనుకుంటున్నారట. అందుకు బన్నీ కూడా బాగా సపోర్ట్ చేయడంతో ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్నేహ నిర్మించబోయే మొదటి సినిమా ఎనర్జిటిక్ హీరో నిఖిల్ తో అని తెలుస్తోంది. ఈ సినిమా కథ ఇలా ఉంది. ఉన్నత విద్యను చదువుకున్న ఓ యువకుడు చివరికి తనకు నచ్చిన ప్రొఫెషన్ ని ఎంచుకొని ఎలా ముందుకు సాగాడు అన్నది స్టోరీ అన్నట్లుగా చెబుతున్నారు. ఈ కథలో బాగా చదువుకున్న హీరో ఎంత మంచి ఆఫర్లు వచ్చినా వదులుకొని లాస్ట్ కి  కుక్ అవుతాడట. దాంతో కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా సరే కుక్ గానే జీవితాన్ని కొనసాగిస్తారట హీరో. ఇలా ఈ లైన్ తో  స్టోరీ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

విభిన్న కథలను ఎంచుకునే హీరో నిఖిల్ ఇప్పుడు ఈ పాత్ర చేస్తారనడంలో ఆశ్చర్యం లేదు అంటున్నారు ఆయన అభిమానులు.   ప్ర‌స్తుతం నిఖిల్ చందు మొండేటి డైరెక్షన్ లో ‘కార్తికేయ 2’, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో  "18 పేజెస్‌" సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల తర్వాత ఓ సినిమా ఉండగా ఆ చిత్రంతో  పాటు స్నేహ రెడ్డి నిర్మించబోతున్న చిత్రంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని చాలా సంబరపడుతున్నారు. మరి స్నేహ రెడ్డి నిర్మాతగా ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: