‘మ‌న్మ‌థుడు’ అనే పదాన్ని వాడాల్సి వస్తే అది టాలీవుడ్ హీరో నాగార్జున‌కు తప్ప ఇంకెవరికీ సూట్ కాదేమో. సుమారు 19 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా నాగ్ కెరీర్ లోనే అతిపెద్ద సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్ప‌టికీ ‘మ‌న్మ‌థుడు’ సినిమా వ‌చ్చిందంటే టీవీల‌కు అతుక్కుపోయే వాళ్లున్నారు అంటే ఈ సినిమా ఎంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అలా సూపర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా చ‌రిత్ర సృష్టించింది. కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో 2002లో విడుదలైన ఈ సినిమాలో నాగార్జున, సోనాలి బింద్రే కీలక పాత్రలో నటించారు. 


దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా త్రివిక్రమ్ మాటలు అందించారు. ఆడవాళ్ళంటే ఇష్టం లేని నాగార్జున అసలు అల ఎందుకు మారాడు ? తిరిగి మళ్ళీ ఒక ఆడదాని ప్రేమలో ఎలా పడ్డాడు ? అనే కధాంశంతో సినిమా తెరకెక్కింది. కధ ప్రకారం నాగార్జున ఒక యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉంటాడు. ఒక లవ్ ఫైల్యూర్ వాలన ఆడజాతి మొత్తం ఇంతే అని మోసం వాళ్ళు ఈజీగా చేస్తారని భావించి అందరినీ అసహ్యించుకొంటూ ఉంటాడు. 


అయితే ఆ సంస్థ అధినేత అయిన తన బాబాయ్ తనికెళ్ళ భరణి మేనేజర్ గా సోనాలి బింద్రేని నియమిస్తాడు. స్త్రీ ద్వేషి అయిన నాగార్జున ముందు సోనాలీని ముప్పు తిప్పలు పెడతాడు, ఆ దెబ్బకు విసిగి పోయి ఆమె కంపెనీ నుంచి తప్పుకోవాలని భావిస్తుంది. అయితే ఆ తరువాత ఏమి జరిగింది ? వాళ్ళు ఎలా ప్రేమలో పడతాడు అనే అంశాలను చాలా హృద్యంగా తెరకెక్కించారు. నాగార్జున ధర్మవరపు సుబ్రహ్మణ్యం ట్రాక్, నాగార్జున బ్రహ్మానందం ట్రాక్స్ ఇప్పటికీ సూపర్ క్రేజీ అంతే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: