టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి తన సినిమాలతో సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వన్నె తగ్గని అలుపెరుగని హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు మెగా స్టార్ గా ఎదిగాడు అంటే ఆయన కృషి, కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో విభిన్నమైన సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలా తన కెరియర్ లో చేసిన వినూత్నమైన పాత్ర చంటబ్బాయి సినిమాలోని డిటెక్టివ్ పాత్ర.

అప్పటికే మాస్ హీరోగా పలు యాక్షన్ సినిమాలతో చిరంజీవి భారీ ఫాలోయింగ్ ని కలిగి ఉన్నాడు. ఒక మాస్ హీరో నుంచి ప్రేక్షకులు యాక్షన్ సినిమాలు మాత్రమే ఎక్స్ పెక్ట్ చేస్తారు కానీ ఈ సినిమాతో చిరంజీవి ప్రయోగం చేసి మాస్ ప్రేక్షకులను కూడా అలరించి హిట్ కొట్టాడు. తనలో కామెడీ పండించగల సత్తా ఉందని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు చిరంజీవి. డిటెక్టివ్ గా ఆయన నటన, చిరు అమాయకత్వం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. తన అసిస్టెంట్ తో చిరు చేసే కామెడీ ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు.

మర్డర్ ఇన్వెస్టిగేషన్ ని చేసే క్రమంలో డిటెక్టివ్ ఎలాంటి కామెడీ ఇబ్బందులు పడ్డాడు. ఆ మర్డర్ కేసు ని ఏవిధంగా సాల్వ్ చేశాడు అనేది ఈ సినిమా కథ కాగా చిరంజీవి గత చిత్రాల లాగా కాకుండా ఎంతో క్లియర్ గా తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చుకొని టైమింగ్ ని కూడా మార్చుకుని చేసిన సినిమా ఇది. 1986లో విడుదలైన ఈ సినిమాని హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల తెరకెక్కించ గా అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సుహాసిని కథానాయికగా నటించగా ఇప్పటి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ చిన్న పాత్రలో మెరిశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: