తొట్టెంపూడి గోపీచంద్.. అటు మాస్ పరంగా ఇటు లవ్  పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరో గోపీచంద్ అని చెప్పవచ్చు. గోపీచంద్ 1975 జూన్ 12వ తేదీన ప్రకాశం జిల్లాలోని, టంగుటూరు దగ్గరున్న కాకుటూరివారి పాలెం గ్రామంలో జన్మించారు. ఇక ఈయన బాల్యమంతా ఒంగోలు అలాగే హైదరాబాద్ లో గడిచింది. ఇక వీరి ఫ్యామిలీ విషయానికి వస్తే, వీరి తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవారట. అలాగే ఈయన తండ్రి, దర్శకుడు టి.కృష్ణ కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. అంతేకాదు పొగాకు ఎగుమతి వ్యాపారం చేయడంతో  బాగా సంపన్నుల కుటుంబం.ఆ తరువాత గోపీచంద్ తండ్రి టి. కృష్ణ సినిమాలపై ఆసక్తి ఉండడంతో చెన్నై వెళ్లారు. ఇక పిల్లలను చదివించడానికి కూడా చెన్నైలోనే ఆయనకు నచ్చిన ఒక పాఠశాల దొరకలేదనే బాధతో ఏకంగా ప్రిన్సిపాల్ నే రప్పించి, ఒంగోలులో "నిల్ డెస్పారాండం" అనే పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలను టి.కృష్ణ స్నేహితులు పాఠశాలల యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గోపీచంద్ కోసమే ఈ స్కూల్ నిర్మాణం అయింది. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు . ఆయన మూడవ తరగతి చదివిన తర్వాత కృష్ణ ..నేటి భారతం అనే సినిమాలో నటించాడు.ఇంజనీరింగ్ పూర్తి చేయడం కోసం రష్యా వెళ్లి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాడు గోపిచంద్. ఇండస్ట్రీలో మరో నటుడైన మాదాల రంగారావు పిల్లలు రష్యాలో వ్యాపారం చేస్తుండగా, వారి దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చుల కోసం డబ్బు సంపాదించుకునే వారు. తన జీవితాన్ని మొదలు పెట్టిన గోపీచంద్, తర్వాత సినిమాలలోకి అడుగు పెట్టారు. సినిమాల్లోకి అడుగు పెట్టడానికి కారణం ఆయన తండ్రి టి.కృష్ణ . ఈయనే ప్రముఖ దర్శకుడు. గోపీచంద్ తొలివలపు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తర్వాత నిజం ,జయం, వర్షం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు.

గోపీచంద్ నటుడు శ్రీకాంత్ చెల్లెలు కూతురు అయిన రేష్మా ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి కూడా పేరు విరాట్ కృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: