అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన మల్టీ స్టార్ సినిమా F2. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడీ కట్టగా వరుణ్‌కి జోడీగా మెహ్రీన్ నటించారు.

అయితే ఈ సినిమా భార్యా బాదితులను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించారు. అయితే ఇద్దరు భార్యా బాదితులు ఒకే ఇంట్లో ఉంటె వారి ఆమధ్య ఎలాంటి వినోదం పుడుతుంది? అన్న‌దాని నుంచే పుట్టిందే ఈ మూవీ. ఇక నటీనటుల విషయానికి వస్తే వెంక‌టేష్ చాలా కాలం త‌ర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ పండించారు. అయితే పాత చిత్రాల్లో వెంక‌టేష్ ఎలా న‌వ్వించారో ఈ సినిమాలో మరోసారి గుర్తుకు తెచ్చారు. అంతేకాదు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా వెంకటశే సినిమాలో హైలైట్‌ గా నిలిచారు.

ఇక ఈ సినిమా వరుణ్ తేజ్ కి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ నటన కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వ‌రుణ్ తేజ్ తెలంగాణ యాస‌లో మాట్లాడాడు కానీ ఆ యాస వ‌రుణ్‌ కు తెచ్చి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అయితే త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మెహ‌రీన్ కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌ ఇలా ప్ర‌తి పాత్ర న‌వ్వించ‌డానికి బాగా కలిసి వచ్చింది.

అయితే దర్శకుడిగానే లాల ర‌చ‌యిత‌గా కోద్దా అనిల్‌ రావిపూడి బాగా స‌క్సెస్ అందుకున్నాడు. ఇక త‌న బ‌లం వినోద‌మే. దాన్ని సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ ప్ర‌తి సీన్‌లో పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు అనిల్ రావిపూడి. ఇక అనవసరమైన ట్విస్టులు, హంగుల‌వైపు వెళ్లకుండా సింపుల్ గా చిత్రీకరించారు. f2 సినిమా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: