అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకుంటే ఎంతటివారైనా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చాలా తక్కువ మంది జీవితాలు ఉదాహరణలుగా నిలుస్తాయి. అందులో హీరో గోపీచంద్ జీవితం కూడా ఒకటి.  పైకి నవ్వుతూ చాలా సింపుల్ గా కనిపించే గోపీచంద్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత విలన్ పాత్రలు చేస్తూ వచ్చి హీరోగా నిలదొక్కుకుని ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. తన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరి ఈ స్థాయికి చేరుకున్నాడు గోపీచంద్.

గోపీచంద్ హీరో కాకముందు ఎనిమిదేళ్లకే మరణం విలువ తెలుసుకున్నాడు. నేటి భారతం, ప్రతిఘటన వంటి విప్లవాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు టి కృష్ణ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గోపిచంద్ చిన్నప్పుడే ఆయన మరణించాడు. అనంతరం సోదరుడు దర్శకుడు కావాలని మొదటి సినిమా మొదలుపెట్టిన కొన్ని రోజులకే యాక్సిడెంట్ లో మరణించాడు. అన్నయ్య మరణించిన టైంలో రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు గోపీచంద్. వీసా సమస్య వల్ల కనీసం అన్నయ్య అంత్యక్రియలకు కూడా రాలేకపోయాడు.

గోపీచంద్ కి ఒక సోదరి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె డెంటిస్ట్ గా వర్క్ చేస్తోంది. ఈ విధంగా గోపీచంద్ తన తండ్రి సోదరుడు మరణాలతో  చాలా కృంగి పోయాడు. అప్పటినుంచి కుటుంబ బాధ్యతలను తానే తీసుకొని హీరో గా ట్రై చేస్తూ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.  తండ్రి మంచితనం వల్ల గోపీచంద్ కి మొదటి సినిమా అవకాశం తొందరగానే వచ్చింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివలపు సినిమా చేశాడు కానీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. మళ్లీ బిజినెస్ వైపు లేదా జాబ్ చేయాలని అనుకున్నాడు. అనంతరం ఈటీవీ న్యూస్ లో రీడర్ గా కూడా చేశాడు. కానీ ఈ సారి సినిమాల్లో విలన్  గా  ట్రై చేసి తన అదృష్టాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలామంది టాప్ హీరోల్లో ఒకరిగా గోపి చందు ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: