ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి వస్తుంటాయి.. పోతుంటాయి.. ఏ మనిషి పూర్తిగా కష్టాల్లో ఉండడు. ఏ మనిషి పూర్తిగా సుఖాల్లో ఉండడు. కష్టసుఖాలు, సుఖదుఃఖాలు ఇవన్నీ జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి. ఆ విధంగా మన తెలుగు సినిమాల్లో హీరోగా సెటిల్ అయిన గోపీచంద్ కి తొలుత కష్టాలు ఎదురైనా ఇప్పుడు మంచి జీవితాన్ని చూస్తున్నాడు. పైకి నవ్వుతూ చాలా సింపుల్ గా కనిపించే గోపీచంద్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు.

టాలీవుడ్ మాస్ హీరోగా తనకంటూ క్రేజ్ అందుకున్న గోపీచంద్ అంటే అందరికీ ఇష్టమైన హీరో. కాంట్రవర్సీల జోలికి వెళ్ళకుండా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కి అయినా గోపీచంద్ అంటే  చాలా ఇష్టం. ఆయన కూడా అందర్నీ ఇష్టపడతాడు. ముఖ్యంగా ప్రభాస్ అతనికి ప్రాణ స్నేహితుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. గోపీచంద్ హీరోగా ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. మొదట గా విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. తెర మీద జీవితం ఎంతో రంగుల మయమైన ఆయన తెర వెనుక జీవితం మాత్రం చాలా కష్టంతో కూడుకున్నది.

తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి మరణం ఇప్పటికీ ఆయన పీడకలల ఉంటుందట. టాలీవుడ్ లో పలు సినిమాలతో దర్శకుడిగా రాణించిన గోపీచంద్ తండ్రి టి.కృష్ణ మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అనిపించింది. తండ్రి లేరన్న బాధతో కుమిలిపోతుంటే గోపీచంద్ అన్న కూడా మరణించడం గోపీచంద్ ను మరింత కృంగదీసింది. తాను రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో అన్న యాక్సిడెంట్ లో మరణించాడు. వీసా సమస్య వల్ల ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారు. దర్శకుడిగా రాణించాలని ఎన్నో కలలు కన్న గోపీచంద్ అన్న తొలిసినిమా చేస్తున్న సమయంలోనే పై లోకాలకు వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: