సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఓ సారి ఉన్న పరిస్థితులు మరోసారి ఉండకపోవచ్చు. అదృష్టం కలిసి రాకపోతే ఎంతటి వారైనా సరే ఇక్కడ వెనుదిరగక తప్పదు. ఒకప్పుడు చక్రం తిప్పిన నటీనటులు సైతం కొన్ని సమయాల్లో పూర్తిగా డీలా పడిపోయిన సందర్భాలు చూశాం. ప్రధానంగా నిర్మాతలు ఇక్కడ రాణించాలంటే హిట్స్ అనేవి చాలా కీలకం. వారు తీసిన సినిమాలు హిట్ అయితే ఆర్థికంగానూ, వ్యక్తిగతంగానూ సినిమా సర్కిల్స్ లో ఎంత సక్సెస్ పొందుతారో, ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే అంతకన్నా ఎక్కువ నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ముందుగా ఆనందించేది నిర్మాతే, అలాగే ఫ్లాప్ అయినా ఎక్కువగా బాధపడేది కూడా వీరే.

ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయితే ఆర్థికంగా ఎక్కువ నష్టపోయేది నిర్మాతే. నిర్మాతలు తీసిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వక ఎంతో మంది నిర్మాతలు తమ ఆస్తులు సైతం అమ్ముకున్న పరిస్థితులు కూడా ఇండస్ట్రీలో చోటు చేసుకున్నాయి. అయినా సరే ఎంతోమంది మళ్లీ సినీ ఫీల్డ్ లోనే కొనసాగడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే వారికి అంత మక్కువ , అంత పిచ్చి, ఫ్యాషన్. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత ఇదే పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో గొప్ప చిత్రాలను తెలుగు తెరకు అందించిన ఆయన ఇప్పుడు వరుస ప్లాపులతో ఆర్థికంగా బాగా డీలా పడ్డారట.


అయినా సరే వెనుకంజ వేయకుండా అప్పులు చేసి మరీ ఓ చిత్రాన్ని తెరకెక్కించగా, కరోనా కారణంగా ఆ సినిమా రిలీజ్ కి కాస్త బ్రేక్ పడింది. దాంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులను అమ్మడానికి రెడీ అయ్యారట ఆ నిర్మాత. దాంతో మానసికంగా కృంగిపోయిన ఆయన కనీసం ఆయన రూమ్ నుండి కూడా బయటకు రావడం లేదని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: