తెలుగులో కామెడీ సినిమాలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పెరు జంధ్యాల గారు. ఆయన సినిమాల్లో హాస్యం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జంధ్యాల గారి సినిమాలు అంటే అప్పట్లో అందరూ ఫ్యామిలీతో హాయిగా ఆనందించే విధంగా ఉండేవి. అలా ఆయన తీసిన గొప్ప హాస్య కథ చిత్రం ఆహా నా పెళ్ళంటా. చెప్పుకోడానికి గొప్ప కథ కాకపోయినా కూడా ఈ సినిమాలో పండిన హాస్యం అంత ఇంత కాదు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. 

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన పిసినారి లక్ష్మీ పతి పాత్రలో కోట శ్రీనివాసరావు జీవించారు అని చెప్పొచ్చు. అయితే  ఈ పాత్రకి ముందుగా  రావుగోపాల్ రావు ని పెడదాం అని నిర్మాత రామనాయుడు  జంధ్యాల గారికి చెప్పారట.కానీ జంధ్యాల గారు మాత్రం ఆ పాత్రకి కోట శ్రీనివాసరావు చాలా బాగుంటారు అని చెప్పి ఒప్పించారు.చివరికి కోట శ్రీనివాసరావుతో ఫోటో షూట్ చేశాక ఆయన సరిగ్గా సరిపోతారని నిర్మాత రామానాయుడు , అలాగే రావు గోపాల్ రావు గారు కూడా ఒప్పుకున్నారు.

ఇక  1987 లో విడుదలైన ఆహా నా పెళ్ళంటా సినిమా కోట గారికి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.. జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా దివంగత స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు గారు నిర్మించారు.ఈ సినిమా తెలుగు కామెడీ సినిమాల్లో ఒక గొప్ప చిత్రం అని చెప్పుకోవచ్చు. ‘అహానా పెళ్ళంట’ చిత్రం కథ మొత్తం కోటా శ్రీనివాసరావు పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పొచ్చు.ఈ పాత్ర కోట గారి కెరీర్ లోనే కాదు తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోతుంది.అలాగే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మరియు రజని హీరో హీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం గారికి కూడా ఇదే మొదటి చిత్రం అవ్వడం విశేషం. ఈ సినిమాకి ఇప్పటికే అంతే క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: