అప్పటికే శ్రీనువైట్ల రవితేజ కాంబినేషన్ లలో రెండు సినిమాలు రాగా మూడో సినిమాగా దుబాయ్ శీను తెరకెక్కింది. మొదటి రెండు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం తో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. దానికితోడు నయనతార హీరోయిన్ అవడం కూడా ఈ సినిమాకు క్రేజ్ పెరగడానికి మరొక కారణం అయ్యింది. 2007 జూన్ 7న విడుదలైన ఈ చిత్రం శ్రీనువైట్ల స్టైల్ లో ఈ చిత్రం అద్భుతమైన చిత్రం గా తెరకెక్కింది. డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో ఒకడి చేతిలో మోసపోతారు హీరో మరియు అతని ఫ్రెండ్స్.

ఆ సమయంలో వీరిని ఓ వ్యక్తి వచ్చి పావుబాజి సెంటర్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాడు. ఈ సాకు తో వారి వద్ద వడ్డీ మీద వడ్డీ డబ్బులు వసూలు చేస్తూ కొత్త రకమైన మోసం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో  తన అన్నయ్య ను వెతుక్కుంటూ వచ్చి హీరోయిన్ ను కలుసుకుని ఆమెతో ప్రేమలో పడతాడు. హీరోయిన్ అన్న ఎవరో కాదు ఒకప్పుడు రవితేజ స్నేహితుడు.. అతను మాఫియా డాన్ తో సంబందం వ్యక్తి. అతన్ని ఆ మాఫియా డాన్ చంపేయడం తో రవితేజ ఎలా ఆ మాఫియా డాన్ ను చంపి తన ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా.

మంచి మంచి కామెడీ సీన్లతో, ఎంటర్టైన్మెంట్ సీన్లతో ఎంతగానో ప్రేక్షకులను అలరింపచేసేలా తెరకెక్కించాడు శ్రీను వైట్ల. వేణుమాధవ్, బ్రహ్మానందం , కృష్ణభగవాన్, భానుచందర్, సునీల్ వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది. నయనతార కూడా తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించింది. సంగీతం పరంగా మణిశర్మసినిమా పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఇచ్చారు. శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఈ మూడో సినిమా వారిద్దరికీ హ్యాట్రిక్ హిట్ ను ఇవ్వగా తెలుగు సినిమాల్లో హాస్య భరితమైన చిత్రాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది దుబాయ్ శీను.. 

మరింత సమాచారం తెలుసుకోండి: