టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి నీ అభివర్ణిస్తుంటారు సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు. ఆయన తన తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర్నుంచి ఇప్పుడు చేస్తున్న ఆర్ఆర్ ఆర్ సినిమా వరకు ఎంతో ప్రత్యేక శ్రద్ధ తో అద్భుతంగా చిత్రాలను తెరకెక్కించి హిట్లు కొట్టారు. తాను చేసే ఏ సినిమాకైనా 100% కష్టపడే రాజమౌళి కొన్ని సినిమాల నుంచి మిశ్రమ ఫలితాలను అందుకున్నారు. కాకపోతే అవి పూర్తిగా ఫ్లాప్ అని చెప్పలేము. ఆ విధంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా లో ఏ సినిమాలు తక్కువ హిట్ అయ్యాయో చూద్దాం.

నితిన్ జెనీలియా హీరోహీరోయిన్ లుగా నటించిన సినిమా సై.. రగ్బీ క్రీడా నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కించాడు రాజమౌళి. నితిన్ కి  మార్కెట్ అంతగా లేకపోవడంతో, జెనీలియా అప్పుడప్పుడే సినిమాల్లోకి రావడంతో అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమా ఆడలేకపోయింది. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా చత్రపతి అప్పట్లో రిలీజైన కొత్త లో ఫెయిల్యూర్  టాక్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండాఫ్ అనుకున్నంత లో లేదని, నిర్మాతకు లాభాలు వచ్చినా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాలేదని టాక్ వచ్చింది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌళి చేసిన యమదొంగ సినిమా కూడా అప్పట్లో విజయం సాధించింది అయితే ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ అయినట్లు కొన్ని శక్తులు కూడ కలుపుకొని ప్రచారం చేశాయి. చేసిన ఖర్చుకు వచ్చిన వసూళ్లకు పొంతన లేదని ఆరోపణలు వినిపించాయి. ఎన్టీఆర్ రాజమౌళి ద్వయం లో వచ్చిన మరో మూవీ సింహాద్రి సినిమా ఫెయిల్ అయిందని వార్తలు కూడా చాలా వచ్చాయి కానీ అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు సినిమా సిబ్బంది. అయితే రాజమౌళి చేసిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే కొంతమంది కావాలని తక్కువ రేంజ్ లో ఆడిన సినిమాలను ఫ్లాప్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: