ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా..? మీరు ఎక్కడైనా చూసినట్టుందా..? కొంచెం సరిగ్గా చూస్తే ఫోటోలో వున్న వ్యక్తి ఎవరో మనకు అర్థమవుతుంది. అయితే అతను ఎవరో కాదండి.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరైన మాటల మాంత్రికుడు"త్రివిక్రమ్ శ్రీనివాస్" . ఈయనట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన సినిమాలోని డైలాగులు అంతగా ప్రేక్షకులను  ఆకట్టుకుంటాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఆయన పెళ్లినాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య సౌజన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంచెం బొద్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు కదా..! ఇక ఈ ఫోటో చూసిన అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పటికీ , ఇప్పటికీ చాలా తేడా ఉంది అంటూ కామెంట్ లు కూడా పెడుతున్నారు. ఇదిలా వుండగా ఈయన పెళ్ళికి ముందు ఒక అనుకోని సంఘటన జరిగిందట. అయితే అక్కడ జరిగిన వింత సంఘటన ఏమిటంటే , త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట సౌజన్య అక్క గారిని పెళ్లిచూపులు చూడడానికి వెళ్ళి, అక్కడ సౌజన్య గారిని చూసి ఇష్టపడడంతో.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని సౌజన్య గారి పెద్దలతో చెప్పారట. ఇక అలా ఇరువురి కుటుంబాల అంగీకారంతో 2002లో వీరి వివాహం జరిగింది.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ , కమెడియన్  అలాగే హీరో "సునీల్ " ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలోకి  అడుగు పెట్టకముందే ఒకే రూమ్మేట్స్. సినీ ఇండస్ట్రీలోకి రాకమునుపు వీరిద్దరూ ఓకే బైకుపై కలిసి తిరగడం కూడా చేసేవారట. అయితే వీరిద్దరి స్నేహం గురించి సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మిగతా వారు కూడా. అందుకే సునీల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో సునీల్ కు నటించే అవకాశాన్ని కూడా కల్పించారు.


ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో ఒక సినిమా అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో తీయాలనుకుంటున్న  సినిమాకు "అయినను పోయిరావలెను హస్తినకు" అనే టైటిల్ ను  ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: