కరోనా సమయంలో జనాలకు ఆదాయం లేక అగచాట్లు పడుతున్నారు. సినిమాలు తీసిన నిర్మాతలు వడ్డీల భారం తో కుదేలు అవుతున్నా రు. ఇంత కరువులో ను మన హీరోలు హీరోయిన్లు ఏ మాత్రం పారితోషకం తగ్గించకుండా నిర్మాతలకు మరింత భారం అవుతున్నారు. తగ్గించకపోగా తమపారితోషకాన్ని పెంచుకుంటూ పోతూ కాకరేపుతున్నారు. అనేక రంగాల లో కరోనా కారణం గా పరిస్థితి భయంకరంగా ఉంది. ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఉన్నాయి.

కథానాయికల పారితోషకాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి.ప్రస్తుతం హిట్ ట్రాక్ లో ఉన్న హీరోయిన్లకు భారీ పారితోషికం పొందుతుండడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. హిట్ ట్రాక్ లో లేని హీరోలు కూడా తమ పారితోషకాన్ని పెంచుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. ప్రతి రోజు పండుగ సినిమా తర్వాత రాశికన్నా ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాలో మరియు నాగచైతన్యతో థ్యాంక్యూ సినిమాలో నటిస్తోంది వీళ్లిద్దరు పెద్ద హీరో లు కాకపోయినా రాశి మాత్రం పారితోషికం విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు.

తెలుగు చిత్రాలతో పాటు తమిళ మలయాళ సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా ఆ కారణంగానే కోటి కి తగ్గకుండా పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట. ఇటీవల కాలంలో పెద్ద హిట్స్ చూడని మెహరీన్ కూడా 50 లక్షలు డిమాండ్ చేస్తోందట. f2 సినిమా తర్వాత మారుతి  చిత్రంలో నటించడానికి ఆమె ఆ మొత్తాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ మేరకు 40 నుంచి 45 లక్షల పారితోషికం సెట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. మాత్రమే కాకుండా సాయి పల్లవి రష్మిక మందన కృతి శెట్టి వంటి తదితర హీరోయిన్ లు కూడా పారితోషికాన్ని అమాంతం పెంచేశారట. వీరే ఇలా ఉంటే హీరోలు ఈ పారితోషకం విషయంలో ఇంకెలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. దాదాపు యాభై కోట్లు హీరోలు వసూలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: