స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ వరుసగా సినిమాలు సెట్ చేసుకుని టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఈ వార్త గురించే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. మీడియాలో సైతం అల్లు అర్జున్ అన్ని సినిమాలు చేస్తున్నాడు ఇన్ని సినిమాలు చేస్తున్నాడు అని తెగ రాసేస్తున్నారు. వీటిలో ఏ ఒక్క సినిమా గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తున్నాడు అని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప సినిమా పూర్తి అవ్వడంతో ఆయన చేసే తదుపరి సినిమా పై ఎంతో ఆసక్తి నెలకొంది.

సినిమా రెండు పార్టులుగా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాపై. అల్లు అర్జున్ కొరటాల శివ తో సినిమా అనౌన్స్  చేసిన ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలేక్కలేదు. ఆ సినిమా ఉందో లేదో కూడా ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఐకాన్ చిత్రాన్ని చేస్తాడా లేదా అన్న రూమర్స్ తెగ షికార్లు చేస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ చిత్రాన్ని అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది అయితే ఆ చిత్రం కాకుండా అలా వైకుంఠపురం లో చేశాడు అల్లు అర్జున్.

ఆ తరువాత మారిన పరిస్థితుల రీత్యా ఐకాన్ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చి మొత్తానికి క్యాన్సల్ అయింది అయితే ఇటీవలే ఈ సినిమా సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ మళ్లీ ఈ సినిమాని తీసుకు వచ్చే ప్రయత్నం చేయగా దానికి దిల్రాజు కూడా సపోర్ట్ ఇవ్వడం తో ఈ సినిమా ఉంటుంది అనే వారు ఎక్కువయ్యారు. దానికి బలాన్నిస్తు ఇప్పుడు సరికొత్తగాసిప్ ప్రచారం అవుతోంది. పుష్ప మొదటి పార్ట్ కి రెండో పార్ట్ కి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది.అంతేకాకుండా కొంచెం స్క్రిప్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్యాప్లో ఐకాన్ చేయాలని డిసైడ్ అయ్యాడట బన్నీ..


మరింత సమాచారం తెలుసుకోండి: