సినిమాల్లో రాణించాలంటే ట్యాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. వెనుక సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలానే ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ ట్యాలెంట్ తో హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఒక కుటుంబానికి చెందిన కొందరు మాత్రమే సినిమాల్లో నటించేవారు. అంటే తండ్రిని బట్టి కొడుకు, అన్నాని బట్టి తమ్ముడు ఇలా చాలా తక్కువ స్థాయిలో వారసత్వం కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ కాలంతో పోల్చుకుంటే ఈ కాలంలో సినిమాల్లో నటించే వారసుల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం టాలివుడ్ లో నాలుగైదు కుటుంబాల వారసుల హవా బాగా కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీస్ లో మెగాస్టార్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీల జోరు బాగా కనిపిస్తుంది. మరి ఆ నట వారసులు ఎవరు. ఎవరి కుటుంభం నుంచి ఎక్కువమంది హీరోలు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో చూద్దాం.

మొదటగా మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ఇప్పటికి ముగ్గురు మెగా బ్రదర్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే వారి తరం తరువాత వారి వారసులు కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఒక డజన్ మంది దాక  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.అందరి ఫ్యామిలీలతో పోలిస్తే మెగా ఫ్యామిలీలో హీరోల సంఖ్య ఎక్కువే అని చెప్పాలి.


 

అలాగే అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన నాగార్జున కింగ్ నాగార్జునగా స్టార్ ఎదిగి ఆ తర్వాత తన కొడుకులు అయిన అఖిల్, నాగ చైతన్యలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అంతేకాక అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్, సుమంత్ వంటి వారు కూడా హీరోలుగా నటిస్తున్నారు.


ఇక దగ్గుబాటి హీరోలలో ముందుగా వినిపించే పేరు విక్టరీ వెంకటేష్. వెంకీ హీరోగా ఎదిగితే అన్న సురేష్ బాబు మాత్రం నిర్మాతగా ఎదిగారు. తరువాత మరొక దగ్గుబాటి హీరో అయిన రానా కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచే అభిరాం దగ్గుబాటి కూడా హీరోగా రాబోతున్నాడు.ఇక నందమూరి ఫ్యామిలీ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ఈ ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతలు మాటల్లో చెప్పలేము.


 స్వర్గీయ నందమూరి రామారావు గారి అసలు సిసలు వారసుడిగా బాలకృష్ణ నిరూపించుకున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది ఇండస్ట్రీలో ప్రవేశించారు. బాలకృష్ణ, హరి కృష్ట, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారక్ ఇలా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.ఇప్పుడు బాలకృష్ణ నట వారసుడిగా కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమాల్లో నటించబోతున్నాడు. అలాగే ఘట్టమనేని కృష్ట ఫ్యామిలీ నుంచి నరేష్, మహేష్ బాబు, సుధీర్ బాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: