టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ప్రొడ్యూసర్స్ నోరు విప్పితే కొన్ని ఖచ్చితమైన నిజాలు బయటికి వస్తాయి అంటారు. ఆ నిజాలు కాంట్రవర్సీ క్రియేట్ చేయవచ్చు లేదా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయవచ్చు కానీ మొత్తానికి మనం ఎక్స్ పెక్ట్ చేయని  ప్రొడ్యూసర్ ఇంతకాలం సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా నోరు మె దిపితే మాత్రం  కావాల్సిన అప్డేట్స్ తో పాటు మీడియా కూడా కంటెంట్ పుష్కలంగా దొరుకుతుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత వరకు గీతా ఆర్ట్స్ బ్యానర్ వెనకే పిల్లర్ ఉంటూ అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ గా తెరమీద కనిపించే నిర్మాత బన్నీవాసు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

 ప్రస్తుతం ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో పరిస్థితి రాబోయే సినిమాలు ఇలా అన్ని విషయాలు మీడియా ఇంటర్వ్యూ lo  బయటపెట్టారు బన్నీవాసు. ఇండస్ట్రీ కరోనా నుండి కోలుకునే దశలోనే ఉంది. ఇప్పట్లో సినిమాలు తెరమీదకు రావాలంటే ఒక్కసారిగా ఇంతకాలం వెయిట్ చేసిన సినిమాలన్నీ థియేటర్స్ పై దాడి చేసినట్లు ఉంటుంది. బన్నీ వాసు  మాట్లాడుతూ ప్రస్తుతం థియేటర్స్ తెర్చుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. దేశం మొత్తం వ్యాక్సిన్ వేసుకుంటే ఆ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు ధైర్యంగా రావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

అదిగాక రిలీజ్ అవ్వాల్సిన బడా సినిమాలతో పాటు చిన్న సినిమాలు మీడియం సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటన్నింటికి థియేటర్స్ విషయంలో కష్టమవుతుంది. మా సంస్థలో ఆల్రెడీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , 18పేజెస్ రిలీజ్ కి సిద్ధం గా ఉన్నాయి.  ఈ రెండు కూడా విభిన్నమైన కంటెంట్ తో రాబోతున్నాయి అయితే ఆ సినిమాలు థియేట్రికల్ రిలీజా ఓ టీ టీ లో రిలీజ్ చేయాలనేది ఆగస్టు సెప్టెంబర్ టైంలో పరిస్థితిని బట్టి చూస్తాం.  కాబట్టి చిన్న మీడియం రేంజ్  సినిమాలు ప్రత్యామ్నాయ దారులను చూసుకుంటే బాగుంటుంది. అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: