తెలుగు సినిమా రంగం ఇపుడు హిట్ల కోసం పరితపిస్తోంది. అసలే వందకు పది హిట్లు కూడా లేని సమయంలో కరోనా రెండు విడతలుగా వచ్చి మొత్తం సీన్ సితార్ చేసి పారేసింది. దాంతో ఇపుడు అంతా కలసి సక్సెస్ మంత్రాన్ని జపిస్తున్నారు.

టాలీవుడ్ లో ఇదివరకు మాదిరిగా పరిస్థితులు లేవు. ఒక సినిమా విషయంలో గతంలో ఎన్నో సిట్టింగులు, కధ మీద నెలల తరబడి కూర్చున్న సందర్భాలు ఉండేవి. ఇపుడు మాత్రం అలా కాదు, మంచి హీరో, బ్యానర్, డైరెక్టర్ ఈ మూడూ సెట్ అయితే చాలు బిజినెస్ అయిపోతుంది. ఆ మీదట వారి క్రేజ్ తో సగం విజయం దక్కుతుంది. జనాలకు నచ్చే అంశాలు ఉంటే సినిమా సూపర్ హిట్టే అవుతుంది.

దీంతో ఇపుడు చిత్ర నిర్మాతలు హీరోల డేట్లను అడగడానికి కొత్త రూట్లో వెళ్తున్నారు. బాగా సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లను బుక్ చేసుకుంటున్నారు. ముందే వారికి అడ్వాన్సులు ఇచ్చేసి తమ వాడు అనిపించేసుకుంటున్నారు. దాంతో తప్పనిసరిగా ఆ డైరెక్టర్ల కోసమైనా హీరోలు కాల్షీట్లు ఇవ్వాల్సిన సీన్ ఉంటోందిట. టాలీవుడ్ లో చూసుకుంటే చాలా మంది పెద్ద డైరెక్టర్లు చేతిలో నాలుగైదు సినిమాలతో అడ్వాన్స్ బుకింగ్ తో బుక్కై పోయారు అని టాక్.

ఆ తరువాత వరసలో ఒకటి రెండు హిట్లు కొట్టిన డైరెక్టర్లు కూడా నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకుని కమిట్ అవుతున్నారుట. దాంతో హీరోలను ఈజీగా తమ వైపు తిప్పుకుని మంచి కాంబోను సెట్ చేసుకునే పనిలో మేకర్స్ ఉన్నారుట. కధ కమామీషూ ఆ తరువాత ముందు సక్సెస్ కే ఓటు అన్నట్లుగా టాలీవుడ్ లో పరిస్థితి ఉంది అని అంటున్నారు. దీని మీద ఈ మధ్య ఒక తలపండిన కధా రచయిత మీడియా ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ హీరోల ఇమేజ్ తోనే సినిమాలు ఆడుతున్న రోజులివి అనేశారు. హీరో ఇమేజికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మధ్యన కధ దూర్చడమే ఎవరైనా చేయాల్సిన పని అంటూ అగ్ర హీరోల సినిమాల కధల వెనక కధల గుట్టు విప్పారు. మొత్తానికి న్యూ ట్రెండ్  టాప్ డైరెక్టర్లకు బాగుంది. మేకర్స్ కూడా హ్యాపీ, హీరోలూ మూవీస్ చేయడానికి రెడీ. సో టాలీవుడ్ కి సక్సెస్ మంత్ర తెలిసినట్లే ఉందనుకోవాలేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: