మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కష్టపడి సినిమాల్లోకి వచ్చి నెంబర్ వన్ హీరో అయ్యాడు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా కూడా నటించారు. ఇక అంతేకాదు మరికొన్ని సినిమాల్లో అయితే విలన్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించారు. అలాంటి టైం లో 1983లో వచ్చిన 'ఖైదీ' చిత్రం చిరంజీవికి స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి చిరు సుప్రీమ్ హీరోగా మారాడు. అలా తన స్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటూ..మరో పక్క అభిమానులను అలరించే మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమాలను చిరు చేస్తూ వచ్చారు.ముఖ్యంగా తన స్టైలిష్ డ్యాన్స్ లతో విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకున్న ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిది.



ఇక కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కే సినిమాలను చేసి బోర్ కొట్టిన సమయంలో. మెగాస్టార్ తనలో ఉన్న నటుడిని సంతృప్తి పరచడం కోసం రుద్రవీణ, చంటబ్బాయ్, వేట వంటి సినిమాలు చేయడం జరిగింది. కానీ అవి మెగాస్టార్ కి కమర్షియల్ గా అంత సక్సెస్ అందించలేదు.ఇక ఈ విషయాలను పక్కన పెడితే …మెగాస్టార్ నటించిన రెండు సినిమాలు మాత్రం అభిమానులను తెగ బాధ పెట్టాయట. అలా అని మెగాస్టార్ సినిమాలు మొత్తం కాదు.. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చాక తమ అభిమాన హీరోని డౌన్ చేసి చూపిస్తే అభిమానులు తట్టుకోలేరు.సరిగ్గా ఇలాగే చిరు స్టార్ హీరో అయ్యాక 'ఆపద్బాంధవుడు' 'స్నేహం కోసం' సినిమాల్లో కొన్ని సీన్ల వల్ల మెగా అభిమానులు చాలా బాధ పడ్డారట.



ఆ సీన్లు ఏంటంటే  'ఆపద్బాంధవుడు' సినిమాలో మెగాస్టార్ కు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక అప్పుడు ఆ సీన్ లో మెగాస్టార్ కాస్త నత్తిగా మాట్లాడతారు. ఇక అలాగే 'స్నేహం కోసం' సినిమాలో పెద్ద మెగాస్టార్ .. తన మిత్రుడి ఇంటికి వచ్చినప్పుడు.. అతని చెప్పులు తీసి పక్కన పెడతాడు. ఈ సీన్లు అస్సలు అభిమానులకు నచ్చలేదట.ఇక ఈ సినిమాలు ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద షోలు ఆపేయాలంటూ అప్పట్లో ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారట. ఇక తర్వాత మెగాస్టార్ దీని గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చి 'పాత్ర స్వభావం అలాంటిది..ఇక కథ రీత్యా అలా చేయడం జరిగిందని సర్ధి చెప్పి తన ఫ్యాన్స్ ని కూల్ చేసినట్టు ఓ సందర్భంలో చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: