బుల్లితెరపై స్టార్ యాంకర్ లుగా కొనసాగుతున్న వారిలో సుమ తరువాత అనసూయ, అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. కేవలం బుల్లితెరపై యాంకర్ గా  మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సినిమాల్లోకి ప్రవేశించి, అక్కడ కూడా తన సత్తా ఏంటో చూపిస్తోంది అనసూయ. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి, హీరోయిన్లకు ఏమాత్రం నేను తీసిపోనూ అంటూ వెండితెరపై కూడా దూసుకుపోతోంది.

అనసూయ సినీ ఇండస్ట్రీలోకి మొదట సాక్షి టీవీలో న్యూస్ రిపోర్టర్ గా పని చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ షో లో ఈమెకి యాంకర్ గా అవకాశం వస్తే , సాక్షి టీవీ ని వదిలేసి, ఈటీవీ కి వచ్చి జబర్దస్త్ షో లో యాంకర్ గా కొనసాగుతోంది. అయితే ఈ షో ఈమెకు మరింత  స్టార్ స్టేటస్ ను సంపాదించిపెట్టింది. ఇక ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించేందుకు అవకాశం రావడంతో,ఆ  సినిమాలో  బుజ్జి పాత్రలో నటించి అందరి చేత మన్ననలు పొందింది. ఇక అంతే కాకుండా ఈమె టెలివిజన్ వ్యాఖ్యాతగా అనేక అవార్డులను కూడా అందుకుంది. ఇక జీ కుటుంబం అవార్డు , స్టార్ పరివార్ అవార్డులను కూడా అందుకోవడం విశేషం.


ఇదిలా ఉండగా , అనసూయ ఎన్నో సినిమాలలో నటించింది. ఇక  ఇప్పుడు మరొక సూపర్ స్టార్ హీరో సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఒక  చిత్రంలో ఎన్టీఆర్ కు అక్క పాత్రలో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఈ చిత్రంలో ఒక లేడీ విలన్ పాత్రలో బాలీవుడ్ నటి నటించబోతోందని వార్తలు గట్టిగా వినబడడంతో ఈ సినిమా పై హైప్ మరింత పెరిగేలా ఉంది. ప్రస్తుతం ntr రాజమౌళి నిర్మిస్తున్న  మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్  చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తుండగా, ఇక డిసెంబర్ 14న ఇదే సంవత్సరంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: