ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన జెనీలియా వివాహం తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లకు ఈ అమ్మడు తిరిగి సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో వార్త అటు జెనీలియా ఫ్యాన్స్ కు మరియు వెంకీ ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తోంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రంలో దాదాపుగా జెనీలియా రీ ఎంట్రీ ప్లాన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు.. లైన్ లో ఉండగా వెంకీ తదుపరి ప్రాజెక్ట్ కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహాతో విక్టరీ వెంకటేష్సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా అనంతరం ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే సినిమాలో మన ఫ్యామిలీ హీరో వెంకీకి జంటగా జెనీలియా నటించబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ది చాలా కీలకమైన పాత్ర అని అందుకు సరదాగా అందరితో అల్లరి చేసే ఓ అమ్మాయి జీవితం అనుకోని సంఘటన వలన ఎలాంటి మలుపులు తిరిగింది అన్న కోణంలో ఈ చిత్రం ఉండబోతోందని చెబుతున్నారు.  ఇక ఆ పాత్రకి జెనీలియా అయితే సరిగ్గా సూట్ అవుతుందని అనుకుంటున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
 
ప్రస్తుతం డైరెక్టర్ వెంకటేష్ మహా హీరో రాజశేఖర్ తో మర్మాణువు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వెంకీతో వెంకటేష్ మహా తన మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నట్లు టాక్. ఇక ఈ చిత్రంలో కనుక జెనీలియా హీరోయిన్ గా ఫిక్స్ అయితే జెనీలియా సెకండ్ ఎంట్రీకి మంచి ఆరంభం లభించినట్లే అవుతుంది. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: