కొన్ని కొన్ని సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమ పోకడను మార్చివేస్తాయి అప్పటిదాకా ఉన్న తెలుగు సినిమా మూస పద్ధతినీ మార్చే విధంగా ఆ సినిమాలు అవతరిస్తాయి. అలా తెలుగు సినిమా పరిశ్రమలో అత్తారింటికి దారేది సినిమా అప్పటి వరకు ఉన్న సినిమా తీసే పద్ధతి నీ పూర్తిగా మార్చివేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సమంత ప్రణీత హీరోయిన్లుగా బోమన్ ఇరానీ,నదియా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో చేసిన ఈ సినిమా 2013లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది.

వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త చనిపోయే ముందు తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన కుమార్తె ను చూడాలని తాపత్రయపడుతు ఉంటాడు.  ప్రేమ వివాహం చేసుకుని వచ్చిన తన కూతుర్ని కాదని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన బాధతో ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్న తాత ఆవేదనను మనవడు అర్థం చేసుకుని తన మేనత్త ఎలాగైనా తీసుకురావాలని బయలుదేరతాడు.ఆ ఇంటికి డ్రైవర్ గా వెళ్ళిన హీరో ఆ తర్వాత ఏ విధంగా తన మేనత్తను ఒప్పించి కలిపాడు అన్నదే ఈ సినిమా యొక్క కథాంశం.

త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్, డైలాగ్స్ కలగలిసిన ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ నటన తోడై దేవిశ్రీప్రసాద్ సంగీతం సహాయంతో సూపర్ హిట్ గా నిలిచింది. జల్సా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్న ఈ సినిమా మరో రేంజ్ లో ఉండాలనే ఫ్యాన్స్ కోరిక ను నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ప్రముఖ హిందీ నటుడు బోమన్ ఇరానీ నటించడం ఎంతగానో ప్లస్ అయింది. ఈ సినిమాలోని ఇతర నటీనటులు బ్రహ్మానందం, ఆలీ, ముఖేష్ రుషి , రావు రమేష్, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు వంటి నటులు తమ తమ పాత్రల మేరకు అద్భుతంగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: