ఏ నటుడికైనా కొన్ని సినిమాలు ఎంతో స్పెషల్ గా నిలుస్తాయి. ఆ సినిమాలు అనుకోకుండా వారి చేతికి వచ్చి వారి కెరీర్ లోనే బెస్ట్ సినిమాలు గా, ఎంతో మంచి సినిమాలు మిగిలిపోతాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో తాను ఎప్పటికీ గుర్తుంచుకునే, గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి నాన్నకు ప్రేమతో. ఈ సినిమా తన బెస్ట్ సినిమా అని చాలా సార్లు స్వయంగా ఎన్టీఆర్ చెప్పాడు. టాలీవుడ్ ఇంటలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

2016 జనవరి 13 న విడుదలైన ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు కీలకమైన విలన్ పాత్రను పోషించారు. ఎన్టీఆర్ తండ్రిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించగా ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఎన్టీఆర్ కెరీర్లో ఎంతో విభిన్నమైన వైవిధ్యభరితమైన సినిమా గా తెరకెక్కింది ఈ సినిమా.  మోసపోయిన తన తండ్రిని గెలిపించేందుకు కొడుకు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ కి మంచి మార్కులు పడ్డాయి.

లెజెండ్ లో యాక్షన్ విలన్ గా, శ్రీమంతుడు లో రిచ్ డాడ్ గా కనబడి మెప్పించిన జగపతిబాబు ఇందులో రెండు పాత్రలను కలగలిపి రిచ్ డాడ్ కం విలన్ పాత్ర పోషించి అదరగొట్టాడు. మొత్తానికి తండ్రి మీద ఉన్న ప్రేమను చాలా చక్కగా తెలియజేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో. ఈ సినిమాకి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వం కి వంక పెట్టనవసరం లేదు కానీ సంభాషణలు కూడా బాగా రాయగలనని ఈ సినిమాతో నిరూపించాడు సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: