అక్కినేని వారి కుటుంబం మొత్తం కలిసి నటించిన సినిమా మనం. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మన ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున  అక్కినేని  నాగచైతన్య మరియు అఖిల్ నటించారు. ఈ అరుదై చిత్రంలో శ్రియ, సమంత కథానాయికలు గా నటించగా అమృతం ధారావాహిక లో ముఖ్య పాత్ర పోషించిన హాస్యనటుడు హర్షవర్ధన్ సంభాషణలను రచించారు.

పునర్జన్మ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ను ఎంతగానో అలరించగా ఈ సినిమాకి సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ కి పాటల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. తన తండ్రి తో, కొడుకుల తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలని అక్కినేని నాగార్జున కలల ప్రాజెక్టు గా ఎన్నో సార్లు ప్రస్తావించారు. అలా ఇష్క్ సినిమా విజయవంతమైన తరువాత నితిన్ ద్వారా ఈ సినిమా దర్శకుడు నాగార్జున ను కలిసి ఈ లైన్ చెప్పారు. అలా అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో 2013 జూన్ 13న ఈ సినిమా లాంఛనంగా  ప్రారంభ మయ్యింది సినిమా.

 తొలి ప్రచార చిత్రం విడుదలయ్యాక మనం సినిమా బ్యాక్ టు ఫ్యూచర్ ఇంగ్లీష్ సినిమా యొక్క స్ఫూర్తి అని ఈ సినిమాలో నాన్ లీనియర్ కథనం వాడుతూ నాగేశ్వరరావు నాగార్జున కొడుకుగా, నాగచైతన్య మనవడిగా కనిపించారు.  ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కీలక అతిధిపాత్రలో పోషింప చేయాలని ప్రయత్నాలు చేసి చివర్లో ఓ ప్రమాదంలో ఈ కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా  కనిపిస్తా డు. వీరందరినీ ఒకే ఫ్రేమ్లో చూసిన అక్కినేని అభిమానులు ఎంతో హ్యాపీ అయ్యారు. నాగార్జున కూడా ఒక మంచి సినిమాతో నాన్నకు సెండాఫ్ ఇవ్వాలనే కోరిక కూడా మనం ద్వారా నెరవేర్చుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: