సౌత్ లో మాత్రమే కాదు యావత్ దేశంలోనే రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నటన, స్టైల్ తో, డైలాగ్ డెలివరీతో దేశం మొత్తం అభిమానాన్ని సంపాదించుకున్న ఒకే ఒక నటుడు రజనీకాంత్. గత కొన్ని రోజులుగా రజిని కెరీర్ నీ పరిశీలిస్తే యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ ఆయన అభిమానులను అలరిస్తున్నారు. సినిమా సినిమాకు ఇమేజ్ ను పెంచుకుంటూ పోతూ రజనీకాంత్ సూపర్ స్టార్ ని మించిన స్టార్ హోదా ను పొందుతున్నాడు. 

ప్రస్తుతం రజనీకాంత్ యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిసారి ఏవో అడ్డంకులు ఈ సినిమా షూటింగ్ కి వచ్చినా కూడా సినిమా షూటింగ్ ఎక్కడ ఆపకుండా జరుగుతూ వచ్చింది. రజినీకి ఆరోగ్యం బాగా లేకపోవడం, కరోనా లాక్డౌన్ రావడం వంటివి ఈ సినిమా షూటింగ్ కి ఆగిపోవడానికి పలు కారణాలు. ఆరోగ్యం బాగా లేకపోయినా సరే హైదరాబాదులో ఈ సినిమా కోసం రజనీకాంత్ రిస్క్ చేసి మరీ 35 రోజుల షూటింగ్ లో పాల్గొన్నారు.

ఇదంతా ఫ్యాన్స్ నీ అలరించడం కోసమే అని ఆ మధ్య ఓ ఓ చిన్న ప్రెస్ మీట్ లో రజనీకాంత్ వెల్లడించారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతానికైతే షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందు రజిని దర్బార్ అనే సినిమాను చేయగా సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో లో సరైన హిట్స్ లేకుండా సతమతమవుతున్న రజినీకాంత్సినిమా మంచి విజయాన్ని అందించాలని చెప్పి దర్శకుడు శివ మంచి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశాడట. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ రజినీకాంత్ ఫాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: