బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ ఆయన అభిమానులను ఎంతగానో కలచివేస్తోంది. మానసిక ఒత్తిడి కారణంగా ఆయన బలవన్మరణానికి పాల్పడగా ఇప్పటికీ ఈ కేసు పూర్తవలేదు. ఆయన  గర్ల్ ఫ్రెండ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ , కుటుంబసభ్యులు, స్నేహితులు, కొలీగ్స్ వంటి వారిని విచారణ చేస్తూ వచ్చిన పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు. సినిమాల పరంగా మంచి మంచి సినిమాలు చేస్తూ టాప్ హీరో గా దూసుకెళ్తున్న సుశాంత్ సింగ్ ఇలా హఠాత్తుగా మరణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సీరియల్ నటుడిగా బాలీవుడ్ లో పేరుప్రఖ్యాతలు సంపాదించిన సుశాంత్ ఆ తరువాత కై పో చే సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలతో తన స్టార్డమ్ ను పెంచుకుంటూ వచ్చాడు. ఎంఎస్ ధోని బయోగ్రఫీ లో ప్రధాన పాత్ర పోషించి స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు సుశాంత్. ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా గా నిలిచిన ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. చిచోరే సినిమా ఆయన కెరీర్లో ది బెస్ట్ చిత్రంగా ఆయన పలుమార్లు చెప్పగా ఆయన కెరీర్ లో మిస్సయిన ఓ ఐదు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయింది. టాలీవుడ్ తరహాలోనే బాలీవుడ్ లోనూ ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు సుశాంత్. రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన సినిమా కూడా సుశాంత్ చేయాల్సిన సినిమానే. డేట్స్ కారణంగా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అర్జున్ కపూర్ , శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్ లు గా నటించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా సుశాంత్ చేయాల్సిన సినిమానే.  ఆయుష్మాన్ ఖురానా నటించిన బ్లాక్ బస్టర్ అందాధున్ , జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన వైవిధ్యభరితమైన చిత్రం రోమియో అక్బర్ వాల్తేర్ చిత్రాలు సుశాంత్ సింగ్ మిస్ చేసుకున్న సినిమాలే. ఈ సినిమా లు సుశాంత్ చేసి ఉంటే ఇప్పుడు కథ వేరేలా ఉండేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: