ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్  దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే మెగాస్టార తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఈ క్రమంలోనే చరణ్ పాత్ర ఆచార్య సినిమా లో ఎలా ఉండబోతుంది అనేదానిపై గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఎన్నో గాసిప్స్ వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఈ గాసిప్స్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇలాంటి వార్తలు మాత్రం అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి.



 అయితే ఆచార్య సినిమాలో సెకండాఫ్ లో రామ్ చరణ్ పాత్ర పరిచయం అవుతుందని ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అని గత కొన్ని రోజుల టాక్ నుంచి వినిపిస్తోంది.  అయితే చరణ్ కేవలం అతిధి పాత్ర లాగా కొంత సమయం మాత్రమే సినిమాలో కనిపిస్తాడు అని గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఓ వార్త వినిపించింది. ఇక ఇప్పుడు మాత్రం అభిమానులను మరింత హుషారెత్తించే వార్త టాలీవుడ్ ను ఊపేస్తోంది. ఇప్పటికే తండ్రి సినిమాలో చరణ్ కూడా  నటించబోతుండడంతో ఇక ఇద్దరినీ ఒకే తెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



 అతిధి పాత్ర అయినా పర్లేదు కాసేపు వీరిద్దరూ తెరమీద కనిపిస్తే అంతే చాలు అని అనుకుంటున్నారు.  అయితే ఆచార్య సినిమాలో చరణ్ ది కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే అతిథి పాత్ర కాదని సెకండాఫ్ మొత్తం సాగిపోయే పాత్ర అని ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. సెకండాఫ్ మొత్తం ఇక చరణ్ పాత్రతోనే సినిమా ముందుకు సాగుతుందని..  ఇక ఇంటర్వెల్ తర్వాత అన్ని సన్నివేశాల్లో చరణ్ పాత్ర ఉంటుందని..  ముఖ్యంగా చిరంజీవి చరణ్ ల మధ్య సన్నివేశాలు కూడా బాగానే ఉంటాయి అని ఒక గాసిప్ వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ వార్త కాస్త ప్రస్తుతం అటు మెగా అభిమానులను హుషారెత్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: